షేక్ హ్యాండ్ వంకతో పావుగంట హింస.. మంచు లక్ష్మితో కలసి.. నటి ఝాన్సీ!
Recommended Video

గత ఏడాది టాలీవుడ్ నటి శ్రీరెడ్డి మీడియా ముందుకు రావడంతో కాస్టింగ్ కౌచ్ పై తీవ్రమైన చర్చ జరిగింది. చాలా రోజులపాటు కాస్టింగ్ కౌచ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జాతీయ మీడియాలో కూడా ఇది సంచలనం. టాలీవుడ్ మా అసోసియేషన్ కొన్ని చర్యలు తీసుకోవడంతో గొడవ కాస్త సద్దుమణిగింది. కానీ తరుచుగా ఈ విషయాన్ని ఎవరో ఒక సెలబ్రిటీ ప్రస్తావిస్తూనే ఉన్నారు. తాజాగా నటి, యాంకర్ అయిన ఝాన్సీ ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శ్రీరెడ్డి అభిప్రాయాలు
శ్రీరెడ్డి చేసిన కాస్టింగ్ కౌచ్ పోరాటం గురించి మాట్లాడుతూ.. ఆమె అభిప్రాయాలు వ్యక్తపరచడంలో కొంత తప్పు ఉందేమో కానీ.. ఇండిస్ట్రిలో కాస్టింగ్ కౌచ్ ఉన్నమాట వాస్తవం. సరైన ప్లాట్ ఫామ్ లేక నటీమణులు ఎవరూ దీని గురించి మాట్లాడలేదని ఝాన్సీ తెలిపింది. శ్రీరెడ్డి పోరాటానికి నా లాంటివాళ్లు మద్దత్తు తెలపకపోవడానికి కారణం ఉంది. అప్పుడు మీడియాలో పెద్ద దుమారం చెలరేగుతోంది. ఆ సమయంలో మాట్లాడి బురద చెల్లించుకోవడం ఇష్టం లేక సైలెంట్ గా ఉన్నట్లు ఝాన్సీ తెలిపింది.

తెరవెనుక మంచు లక్ష్మితో కలసి
కానీ తాము మాత్రం కాస్టింగ్ కౌచ్ చర్యలు తీసుకునేందుకు తెరవెనుక కొన్ని ప్రయత్నాలు చేసాం. నేను, మంచు లక్ష్మి, నందిని రెడ్డి లాంటి సెలబ్రిటీలం కలసి కాస్టింగ్ కౌచ్ నివారణకు కొన్ని చర్యలు తీసుకున్నాం. నటీమణులు ఫిర్యాదు చేయడానికి సరైన వేదిక కల్పించాం అని ఝాన్సీ తెలిపింది. అలాంటి వెదికే ఉండి ఉంటే శ్రీరెడ్డి గురించి మీడియాలో ఇంత రచ్చ జరిగి ఉండేది కాదని ఝాన్సీ అభిపాయ పడ్డారు.

మరో అవకాశం లేకుండా
కొంత మంది నటీమణులకు మరో అవకాశం లేకుండా చేసి లొంగదీసుకుంటున్నారు. తప్పని పరిస్థితుల్లో వాళ్ళు లొంగాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఫిర్యాదు చేయడానికి సరైన వేదిక లేక మౌనంగా భరించేవాళ్ళు ఉన్నారు. తాము ఇప్పుడు కంప్లైన్ట్స్ తీసుకుంటుండడం వలన కొంత మేరకు కాస్టింగ్ కౌచ్ తగ్గింది అని ఝాన్సీ తెలిపారు. ఎన్ని చర్యలు తీసుకున్న కాస్టింగ్ కౌచ్ పూర్తి లేకుండా పోతుందని చెప్పలేం. చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు.. లోంగే అమ్మాయిలు లొంగుతూనే ఉంటారు అని అన్నారు.

షేక్ హ్యాండ్ వంకతో
నటీమణులకు షేక్ హ్యాండ్ ఇచ్చే వంకతో పావు గంట సేపు హింసించే పరిస్థితులు ఉన్నాయి. ప్రతి నటి ఇలాంటి పరిస్థితి ఒక్కసారైనా ఎదుర్కొని ఉంటుందని అనుకుంటున్నా. నా విషయానికి వస్తే కెరీర్ ఆరంభం నుంచి క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నా. నాపై వేసే రాళ్లన్ని కూడా ఎదుగుదలకు ఉపయోగించుకుంటున్నా అని ఝాన్సీ తెలిపారు.


Click it and Unblock the Notifications











