డబ్బులు లేక పది రోజులు పస్తులున్నా.. బిగ్‌బాస్ వేదికపై యాంకర్ లాస్య కంటతడి
బిగ్‌బాస్‌లోకి ప్రవేశించిన యాంకర్ లాస్య మొదటి సారే బుల్లితెర ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. తన గురించి రికార్డ్ చేసిన ఫ్రొఫైల్ వీడియోలో తన జీవితంలోని కొన్ని విషయాలను చెప్పి ఎమోషనల్ అయ్యారు. లవ్లీగా వేదికపైకి వచ్చిన లాస్య నాగార్జునతో ముద్దు ముద్దుగా మాట్లాడారు. లాస్య చెప్పి లెక్కల గురించి నాగ్ ఆటపట్టించారు. అలా లాస్య మాట్లాడుతూ..
Recommended Video

నా పేరు ప్రియాంక లాస్య రెడ్డి
నా పేరు ప్రియాంక లాస్య రెడ్డి. నాది కడప పట్టణం. నా ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏదో సాధించాలనే కోరికతో ఉండేదానిని. యాంకర్ కావడం యాదృచ్చికం. 2009 ప్రేమలో పడ్డాను. 2017 పెళ్లి చేసుకొన్నాను. ప్రతీ షోకు నాకు 300 రూపాయలు వచ్చేవి. ఇంటి రెంట్ కట్టడానికి సరిపోయేవి కాదు. పది రోజులు పస్తులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. నేను ప్రేమించిన వ్యక్తిని మరోసారి పెళ్లి చేసుకోవడం హ్యాపీగా ఉంది. మాకు జున్ను ఓ బాబు. నేను ఏంటో నిరూపించుకోవడానికి బిగ్‌బాస్ షోకు వచ్చాను.

మా అబ్బాయి బాధ్యతలను
బాబు బాధ్యతను మా ఆయనకు, మా అత్త, మామయ్యకు అప్పజెప్పాను. బాబు గుర్తుస్తే బాధగా ఉంటుంది. నేను షోలోకి వెళ్లడం కేవలం మా బాబు కోసం, వాడి ఫ్యూచర్ కోసం. అమ్మ ఏం చేసినా పిల్లల కోసమే అనేది అందరికి తెలిసిందే.
లాస్య ఇంటిలోకి వెళ్లే ముందు నాగార్జున ఓ చిన్న బహుమతిని ఇచ్చారు. ఓ బాక్సులో చిన్న బేబీ బొమ్మను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ తర్వాత భర్త మంజునాథ్, కొడుకు జున్నుతో మాట్లాడించారు. ఐ లవ్ యూ అంటూ ఇద్దరికి విషెస్ చెప్పారు.

చీమ, ఏనుగు జోక్‌తో
ఇంట్లోకి వెళ్లే ముందు లాస్యతో చేత ఓ జోక్ చెప్పించారు. చీమ, ఏనుగు జోకు చెప్పారు. చీమకు ఉతరం, దక్షిణంకు తేడా ఏంటన అడిగితే.. ఉత్తరం పోస్టు బాక్సులో వేస్తారు.. దక్షిణం అయ్యగారికి ఇస్తారు అని లాస్య జోక్ చెప్పారు. అయితే నాగార్జున ఆమె జోక్‌పై సెటైర్ వేస్తూ.. ఈ రోజుల్లో ఉత్తరాలు రాస్తారా అంటూ నవ్వుతు ఇంట్లోకి లాస్యను పంపించారు.

యాంకర్ లాస్య కెరీర్ గురించి
యాంకర్ రవితో కలిసి సమ్‌థింగ్ స్పెషల్ అనే షోతో యాంకర్‌గా లాస్య కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత మొండి మొగుడు పెంకి పెళ్లాం, మా ఊరి వంట, ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షో లతో పాపులర్ అయ్యారు. ఉత్తమ వీడియో జాకీగా ఎన్నో అవార్డులు అందుకొన్నారు. 2017లో మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వారికి జున్ను అనే అబ్బాయి 2019లో పుట్టారు.


Click it and Unblock the Notifications











