రెండో సినిమా అప్డేట్ అప్పుడే.. ఆడా ఉంటా ఈడా ఉంటా.. యాంకర్ ప్రదీప్ కామెంట్స్

హీరోగా మొదటి సినిమా రిలీజ్ అవుతుంటే.. మొదటి సారిగా హీరోగా వెండితెరపై చూసుకునే ఆ సమయం అంటే ప్రతీ ఒక్కరికీ జీవితంలో గుర్తుండిపోయే క్షణంలా ఉంటుంది. ప్రస్తుతం ప్రదీప్ కూడా అదే మూడ్‌లో ఉన్నాడు. తాను హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా రేపు (జనవరి 29) రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రదీప్ తాజాగా లైవ్‌లోకి వచ్చాడు. తన అభిమానులతో కాసేపు అలా సరదాగా ముచ్చట్లు పెట్టాడు.

ప్రమోషన్స్ కార్యక్రమాలు..

ప్రమోషన్స్ కార్యక్రమాలు..

30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాకు చేయాల్సిన ప్రమోషన్స్ అన్నీ చేశారు. చివరకు ఓ ప్రమోషనల్ సాంగ్ పేరిట తన స్నేహితురాళ్లు టాప్ యాంకర్స్ అందరినీ తీసుకొచ్చాడు. అందరూ కలిసి చేసిన ఆ డ్యాన్స్ పర్ఫామెన్స్, వావా మేరే బావా అనే పాట బాగానే క్లిక్ అయింది.

 రెండు రకాల పాత్రలు..

రెండు రకాల పాత్రలు..

మొదటి సినిమాలోనే రెండు రకాల పాత్రలు చేయడం ఎంతో బాగా అనిపించింది. మొదటగా కాలేజ్ పాత్రను చేశాను.. ఆ తరువాత మూడు నెలలు గడ్డం, జుట్టు పెంచి తయారయ్యాను. కేరళలో ఆ పాత్రను బాగా షూట్ చేశాం.. అక్కడే నీలి నీలి ఆకాశం అనే పాటను తెరకెక్కించామని యాంకర్ ప్రదీప్ చెప్పుకొచ్చాడు.

 ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో..

ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో..

కాలేజ్‌లో ఉన్న సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఎన్నో సినిమాలు చూశాను.. కాలేజ్ బంక్ కొట్టి మరీ ఎన్నో సినిమాలు చూశాను.. అలాంటిది ఇప్పుడు నా సినిమా పోస్టర్ కూడా అక్కడే ఉంది.. అందుకే రేపు సుదర్శన్ 35 ఎంఎంలో సినిమా చూడటానికి వెళ్తున్నాను అని ప్రదీప్ పేర్కొన్నాడు.

 రెండో సినిమా అప్పుడే..

రెండో సినిమా అప్పుడే..


హీరోగా రెండో సినిమా అనేది త్వరలోనే అప్డేట్ ఇస్తాను.. ముందుగా ఈ మొదటి సినిమా ఫలితం ఎలా వస్తుందో చూడాలి.. జనాలు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.. ఆ తరువాతే రెండో సినిమా అని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత మళ్లీ మాట్లాడుతూ.. ఓ కథ విన్నాను.. త్వరలోనే అప్డేట్ ఇస్తాను.. అంటూ అసలు విషయం చెప్పాడు.

Recommended Video

30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? Release Date ఫిక్స్
ఆడా ఉంటా ఈడా ఉంటా..

ఆడా ఉంటా ఈడా ఉంటా..

బుల్లితెరా? వెండితెరా? అని ఓ నెటిజన్ అడిగాడు. దానికి స్పందించిన ప్రదీప్ సమయస్ఫూర్తితో సమాధానం ఇచ్చాడు. నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడా ఉంటా అని.. అవకాశాలు ఎక్కడ వస్తే అక్కడ చేస్తుంటానని.. చివరగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే లక్ష్యమని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X