ఎట్టకేలకు: కోర్టు బోనులో ప్రదీప్.. తీర్పుపై టెన్షన్!, జైలా?.. జరిమానా?

డిసెంబర్ 31వ తేదీ రాత్రి పీకల్లోతు మద్యం సేవించి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో యాంకర్ ప్రదీప్ అడ్డంగా బుక్కయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కౌనెల్సింగుకు డుమ్మా కొట్టి.. కేసు నుంచి బయటపడేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవి సఫలం కాకపోవడంతో ఎట్టకేలకు పోలీసుల ముందుకు రాక తప్పలేదు. ఇప్పటికే కౌన్సెలింగుకు హాజరైన ప్రదీప్ ను నేడు కోర్టులో హాజరుపరిచారు..

Recommended Video

యాంకర్ ప్రదీప్‌కు షాకిచ్చిన పోలీసులు..!
 కోర్టు ముందు హాజరైన ప్రదీప్:

కోర్టు ముందు హాజరైన ప్రదీప్:

జూబ్లీహిల్స్ పోలీసులు నేడు యాంకర్ ప్రదీప్ ను నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరుపరిచారు. పరిమితికి మించి మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన కేసుతో పాటు, కారుకు బ్లాక్ ఫిల్మ్ తొలగించని కేసులు అతనిపై నమోదవడంతో.. కోర్టు వాటిపై విచారణ జరపనుంది.

 జైలా?.. జరిమానా?:

జైలా?.. జరిమానా?:

విచారణ తర్వాత కోర్టు ప్రదీప్‌కు ఎలాంటి శిక్ష విధించోతుందన్నది ఆసక్తికరంగా మారింది. జరిమానాతోనే సరిపెడుతారా?.. లేక జైలుకు పంపిస్తారా? అన్న విషయం ప్రదీప్ ను కూడా టెన్షన్ పెడుతున్నట్లు సమాచారం.

 పట్టుబడి.. ఆపై అజ్ఞాతంలోకి:

పట్టుబడి.. ఆపై అజ్ఞాతంలోకి:

డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ తర్వాత ప్రదీప్ చాలా రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హఠాత్తుగా ఓ వీడియో రూపంలో తన సందేశాన్ని పంపించాడు. తానెక్కడికి పారిపోలేదని, న్యాయ వ్యవస్థపై నమ్మకముందని లొంగిపోతానని చెప్పాడు.

 వాయిదా వేస్తూ..;

వాయిదా వేస్తూ..;

ఆ వీడియోలో చెప్పినట్లుగానే ఎట్టకేలకు ఈ నెల 7వ తేదీన ప్రదీప్ కౌన్సెలింగ్ కు హాజరయ్యాడు. అయితే ఆ తర్వాత కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నా.. షూటింగ్ కారణం చెబుతూ వాయిదా వేస్తూ వస్తున్నాడు.

22న అని చెప్పి.., నేడే..:

22న అని చెప్పి.., నేడే..:

నిజానికి ఈ నెల 22వ తేదీన ప్రదీప్ కోర్టుకు హాజరవుతానని చెప్పాడు. కానీ నిర్ణయం మార్చుకుని నేడే కోర్టుకు ముందుకు రావడం గమనార్హం. డ్రంకన్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డ వేళ 178పాయింట్ల ఆల్కహాల్ సేవించినట్లు తేలడంతో.. కోర్టు దీన్ని తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. కాబట్టి ప్రదీప్‌కు జైలు శిక్ష తప్పకపోవచ్చేమో!.

 మధ్యాహ్నానికి తీర్పు..:

మధ్యాహ్నానికి తీర్పు..:

మొత్తానికి యాంకర్ ప్రదీప్ కు జైలు శిక్షా? కేవలం జరిమానా? అన్నది ఈ మధ్యాహ్నానికి తేలిపోనుంది. తీర్పు పట్ల ప్రదీప్ తో పాటు సామాన్య జనంలోనూ ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ప్రదీప్ ఎటువంటి శిక్ష అనుభవించబోతున్నాడో!..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X