డ్రంక్ అండ్ డ్రైవ్: యాంకర్ ప్రదీప్‌కు శిక్ష ఖరారు.... కోర్టు తీర్పు ఇదే!
Recommended Video

అతిగా మధ్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన టీవీ యాంకర్ ప్రదీప్‌కు శిక్ష ఖరారైంది. ఈ కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం తుది తీర్పు వెల్లడించింది. దీంతో గత 20 రోజులుగా జరుగుతున్న హడావుడికి తెరపడింది.

కోర్టు తీర్పు ఇదే
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ మూడుళ్ల పాటు రద్దు చేయడంతో పాటు రూ. 2100 జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. జరిమానా విధించడానికి ప్రదీప్ ఒప్పుకున్నారు.

జైలు శిక్ష అంటూ ప్రచారం
ప్రదీప్ మీద కేసు బుక్ అయిన రోజు నుండి..... అతడు సేవించిన మద్యం మొతాను బట్టి కనీసం వారం రోజులు జైలు శిక్షపడే అవకాశం ఉందంటూ కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ జరుగలేదు.

మీడియాలో హడావుడి
డిసెంబర్ 31వ తేదీ రాత్రి అతిగా మధ్యం సేవించి కారు నడపడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు కారు సీజ్ చేశారు. కౌన్సిలింగుకు రావాల్సిందిగా ఆదేశించారు. అయితే ప్రదీప్ పోలీసులు చెప్పిన తేదీకి రాక పోవడం, ప్రదీప్ ఇంటికి పోలీసులు వెళ్లడంతో ఈ విషయంలో మీడియాలో చాలా హడావుడి జరిగింది.

178 పాయింట్లు
డిసెంబర్ 31వ తేదీ రాత్రి బ్రీత్ ఎనలైజర్‌తో పోలీసులు ప్రదీప్‌ను పరీక్షించగా.... 178 పాయింట్లు చూపించింది. దీన్ని బట్టి సాధారణ స్థాయి కంటే ప్రదీప్ నాలుగైదు రెట్లు ఎక్కువ మధ్యం సేవించినట్లు పోలీసులు తేల్చారు.

మీడియా ముందుకు వచ్చి ప్రదీప్ క్లారిటీ
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ అయిన తర్వాత కనిపించకుండా పోవడానికి షూటింగ్ కమిట్మెంట్సే కారణమని, తాను ఎక్కడికీ పారిపోలేదని, ‘లా' ప్రకారం ఫాలో అవుతున్నాను అని ప్రదీప్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పశ్చాత్తాపం
గతేడాది నేను ఒక వీడియో ద్వారా నేను ట్రాఫిక్ రూల్స్ గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని ప్రచారం చేసిన మాట నిజమే. దురదృష్ట వశాత్తు నేను వాటిని ఉల్లంఘించాను.... అని యాంకర్ ప్రదీప్ పశ్చాత్తాప పడ్డారు.

నేను చేసిన తప్పు ఎవరూ చేయొద్దు
నేను చేసిన తప్పు ఇంకా ఎవరూ చేయకూడదు అని కోరుకుంటున్నాను. అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను.... అంటూ ప్రదీప్ అభిమానులకు సూచించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











