తెలిసీ నేరం చేశాడు: యాంకర్ ప్రదీప్‍కు జైలు ఎన్ని రోజులో?
Recommended Video

మద్యం తాగి వాహనం నడపటం నేరం. మత్తులో కారు అదుపు తప్పితే వారి ప్రాణాలతో పాటు.... ఇతరుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో హైదరాబాద్ పోలీసులు గత కొంత కాలంగా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనల్లో పలువురు సాధారణ ప్రజలతో పాటు సినీ ప్రముఖులు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. తాజాగా యాంకర్ ప్రదీప్ డిసెంబర్ 31 రాత్రి పబ్బులో మందు కొట్టి తన కారు (టీఎస్ 07 ఈయూ 6666) డ్రైవ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు.

జనవరి 2న ప్రదీప్‌కు కౌన్సిలింగ్
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ప్రముఖ యాంకర్ ప్రదీప్ కు పోలీసులు జనవరి 2 కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. బేగంపేటలోని కౌన్సెలింగ్ సెంటర్ మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని అతడిని పోలీసులు ఆదేశించారు.

కౌన్సిలింగ్, ఆపై కోర్టుకు
ప్రదీప్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఇతర తాగుబోతులందరినీ ఒక చోట కూర్చోబెట్టి నిపుణులు కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ సందర్భంగా వారికి మధ్యం తాగి వాహనం నడపటం వల్ల జరిగే నష్టాలపై డాక్యుమెంటరీ ప్రదర్శించనున్నారు. ఆపై కోర్టులో హాజరు పరుచనున్నారు.

శిక్ష పడే అవకాశం
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో ప్రదీప్ సేవించిన మధ్యం 178 పాయింట్లను చూపించింది. సాధారణంగా అయితే 35 పాయింట్లకు మించకూడదు. 178 పాయింట్లు వచ్చాయంటే ప్రదీప్ ఏ స్థాయిలో మద్యం సేవించాడో అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రదీప్‌కు జైలు శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. ఇలాంటి కేసుల్లో శిక్ష మినహాయింపు ఉండదని తెలుస్తోంది. జైలు శిక్ష కనీసం వారం రోజులు... గరిష్టంగా మూడు నెలలు ఉండే అవకాశం ఉంది.

మరో కేసు కూడా..
ప్రదీప్ తన కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లు తొలగించకపోవడంపై కూడా కేసు నమోదైనట్టు సమాచారం. కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అంటించడం నిషేదం అనే విషయం తెలిసిందే.

కొన్ని రోజుల క్రితం కమెడియన్ నవీన్ కూడా..
గత నెల డిసెంబర్ మొదటివారంలో సినీ నటుడు, కమెడియన్ నవీన్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికి పోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నవీన్ మీడియాను చూసి పారిపోవడం, కారు కింద దాక్కోడం లాంటి చర్యలతో హల్ చల్ చేశాడు. గతంలో అనేక మంది సినీ సెలబ్రిటీలు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిపోయారు.


Click it and Unblock the Notifications











