ప్రదీప్ మూవీ ప్రెస్‌మీట్‌లో అపశృతి: స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్.. ఆయన పరిస్థితికి కారణమిదే!

చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్లు సత్తా చాటుతున్నారు. తమ అందచందాలతో మెస్మరైజ్ చేస్తూ ఈ గ్లామర్ ప్రపంచంలో నెగ్గుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తనలోని అద్భుతమైన టాలెంట్‌ను బయటకు తీసుకొచ్చి టాప్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఎంతో కాలంగా టెలివిజన్ రంగంలో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోన్న అతడు.. హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్‌తో కలిసి ప్రదీప్ ప్రెస్‌మీట్ నిర్వహించాడు. అది జరుగుతోన్న సమయంలో డైరెక్టర్ స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు. ఆ వివరాలు మీకోసం!

Glamorous Celebrities Photos

అలా మొదలుపెట్టి.. ఇలా సెట్టయ్యాడు

అలా మొదలుపెట్టి.. ఇలా సెట్టయ్యాడు

రేడియో జాకీగా కెరీర్‌ను ఆరంభించి యాంకర్‌గా పరిచయం అయ్యాడు ప్రదీప్ మాచిరాజు. జీ తెలుగులో ప్రసారం అయిన 'గడసరి అత్త సొగసరి కోడలు' అనే షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అతడు.. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. ఫలితంగా యూత్‌తో పాటు లేడీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

ఎన్నో సినిమాలు... హీరోగా పరిచయం

ఎన్నో సినిమాలు... హీరోగా పరిచయం

బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా వెలుగొందుతోన్న ప్రదీప్.. కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది', అల్లు అర్జున్ సక్సెస్‌ఫుల్ సినిమా 'జులాయి', నాగ చైతన్య హిట్ మూవీ '100% లవ్', ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' వంటి చిత్రాలు అతడికి పేరు తెచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హీరోగా పరిచయం అవుతున్నాడు.

30 రోజుల్లో.. రికార్డులు క్రియేట్ చేసింది

30 రోజుల్లో.. రికార్డులు క్రియేట్ చేసింది

నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోన్న ప్రదీప్.. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. మున్నా అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమాను ఎస్వీ బాబు నిర్మించారు. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలోని 'నీలి నీలి ఆకాశం' అనే పాట రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది.

రెండు బడా సంస్థలు ముందుకొచ్చాయి

రెండు బడా సంస్థలు ముందుకొచ్చాయి

ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ.. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' విడుదలకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఒకానొక దశలో సినిమా విడుదల అయ్యే అవకాశాలు కూడా లేవన్న టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో బడా నిర్మాణ సంస్థలు గీత ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా దీన్ని విడుదల చేసేందుకు ముందుకొచ్చాయి. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి.

ప్రదీప్ సినిమా ప్రెస్‌మీట్‌లో అపశృతి

ప్రదీప్ సినిమా ప్రెస్‌మీట్‌లో అపశృతి

యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తోన్న మొదటి చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ట్రైలర్‌ను వదిలారు. దీనికి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించగా.. అందులో అపశృతి చోటు చేసుకుంది.

 స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్

స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్

తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో చిత్ర హీరో ప్రదీప్ మాట్లాడుతోన్న సమయంలో.. అతడి వెనుక నిల్చుని ఉన్న దర్శకుడు మున్నా ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్న వారంతా కంగారు పడిపోయారు. ఆ వెంటనే స్టేజ్ కిందకు తీసుకెళ్లి సపర్యలు చేశారు. దీంతో అతడు కోలుకున్నాడు. తీవ్ర పని ఒత్తిడి వల్లే డైరెక్టర్ మున్నా కళ్లు తిరిగి పడిపోయాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X