For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో వివాదంలో చిక్కుకున్న ప్రదీప్: నోరు జారి బుక్కైపోయిన యాంకర్.. లైవ్‌లోనే వార్నింగ్ ఇచ్చిన నేతలు

  |

  తెలుగు బుల్లితెరపై తనదైన శైలి హోస్టింగ్‌తో మజాను పంచుతూ.. నెంబర్ వన్ మేల్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. దాదాపు ఏడెనిమిదేళ్లుగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తోన్న అతడు.. వరుస షోలతో సత్తా చాటుతున్నాడు. ఈ మధ్యనే సినిమా హీరోగానూ సక్సెస్‌ను అందుకున్నాడు. ఇక, ఈ టాలెంటెడ్ యాంకర్ తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తద్వారా మరో కాంట్రవర్సీలో ఇరుకున్నాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలేంటో చూద్దాం పదండి!

  అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

  అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్

  రేడియో జాకీగా కెరీర్‌ను ఆరంభించాడు ప్రదీప్ మాచిరాజు. దాని ద్వారా చాలా మందికి సుపరిచితుడు అయిన అతడు.. ఆ తర్వాత యాంకర్‌గానూ ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలోనే తనలోని టాలెంట్‌ను నిరూపించుకుని నంది అవార్డును కూడా అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా షోలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. తద్వారా నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు.

  సీరియళ్ల మధ్య పోటీతో కొత్త ప్రోగ్రాం

  సీరియళ్ల మధ్య పోటీతో కొత్త ప్రోగ్రాం

  తెలుగు బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ ఎన్నో కార్యక్రమాలను హోస్ట్ చేస్తున్నాడు. పలు ఛానెళ్లలలో ఎన్నో రకాల షోలు చేస్తున్న అతడు.. ప్రస్తుతం ప్రముఖ ఛానెల్ జీ తెలుగులో ‘సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్' అనే ప్రోగ్రాం చేస్తున్నాడు. ఇది ఈ ఆదివారం ప్రారంభం అయింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో ప్రదీప్ తనదైన శైలి పంచులతో అందరినీ తెగ నవ్వించేశాడు.

  ఏపీ రాజధానిపై షాకింగ్ కామెంట్స్

  ఏపీ రాజధానిపై షాకింగ్ కామెంట్స్

  తాజాగా యాంకర్ ప్రదీప్ ఓ షోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాట్లాడాడు. ఈ సమయంలో అతడు ఏపీ క్యాపిటల్‌గా అమరావతిని కాదని విశాఖపట్నం అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడిదే వివాదానికి కారణం అయింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇది పెద్ద ఇష్యూ అయింది. దీంతో యాంకర్ ప్రదీప్ మాచిరాజు మరో వివాదంలో చిక్కుకున్నట్లు అయింది.

  కోర్టులో ఉన్న దాన్ని ఎలా చెప్పారు?

  కోర్టులో ఉన్న దాన్ని ఎలా చెప్పారు?

  ఏపీ రాజధాని విషయంలో యాంకర్ ప్రదీప్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఆ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు తాజాగా ఓ మీడియాతో మాట్లాడారు. ‘ఏపీ రాజధానికి సంబంధించిన విషయం కోర్టులో ఉంది. అలాంటి అంశం గురించి టీవీ షోలలో ఎలా మాట్లాడతారు. వెంటనే ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి' అని అన్నారు.

  యాంకర్ ప్రదీప్ ఇంటిని ముట్టడిస్తాం

  యాంకర్ ప్రదీప్ ఇంటిని ముట్టడిస్తాం

  దీనిపై మాట్లాడుతూ.. ‘ఎంతో కాలంగా అమరావతిలో రైతులు, అక్కడి ప్రజలు రాజధాని గురించి పోరాటాలు చేస్తున్నారు. అలాంటిది వాళ్ల మనోభావాలు దెబ్బతీసేలా ప్రదీప్ విశాఖను రాజధాని అంటూ మాట్లాడాడు. దీనిపై అతడు వెంటనే క్షమాపణలు చెప్పాలి. లేకుంటే హైదరాబాద్‌లోని ఆయన ఇంటిని ఈరోజే ముట్టడిస్తాం' అంటూ లైవ్‌లోనే కొలికలపూడి శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు.

  30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? Release Date ఫిక్స్
  ఆ ఛానెల్‌ యాజమాన్యానికి వార్నింగ్

  ఆ ఛానెల్‌ యాజమాన్యానికి వార్నింగ్

  ఏపీ రాజధాని విషయంలో ప్రారంభం అయిన వివాదంలోకి జీ తెలుగు యాజమాన్యాన్ని కూడా తీసుకొచ్చారు. కొలికలపూడి శ్రీనివాసరావు తాజాగా ఈ అంశం గురించి మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలకు యాంకర్ ప్రదీప్‌తో పాటు జీ తెలుగు యాజమాన్యం కూడా క్షమాపణలు చెప్పాలి. లేకుంటే ఆ ఛానెల్ కార్యాలయాన్ని కూడా ముట్టిడిస్తాం' అంటూ ఆయన మరోసారి వార్నింగ్ ఇచ్చారు.

  English summary
  Pradeep Machiraju Recently Did Shocking Comments about Andhra Pradesh Capital. This Went Wrong in AP. Then AP Parirakshana Samithi Asking Apologies From This Anchor.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X