యాంకర్ ప్రదీప్ సినిమాకు కోట్లలో ఆదాయం.. ఒక్క పాట జీవితాన్నే మార్చేసింది!

యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ప్రదీప్ బుల్లితెరపై కనిపిస్తే ఫ్యామిలీ ఆడియేన్స్ ఎంతగా ఎట్రాక్ట్ అవుతారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదట ఈ స్టార్ యాంకర్ నటుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు గాని పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక యాంకర్ అనే క్యాటగిరిలో టాప్ కి చేరుకోవడంతో డైరెక్ట్ గా హీరోగా అడుగులు వేస్తున్నాడు. అయితే ప్రదీప్ సినిమా ఇంకా విడుదల కూడా కాలేదు అప్పుడే ఆదాయం కోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది.

 మొదటి పాటతోనే..

మొదటి పాటతోనే..

ప్రదీప్ హీరోగా నటించిన మొదటి సినిమా '30రోజుల్లో ప్రేమించడం ఎలా?'. అసలైతే ఈ సినిమా సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. సినిమాను ఎలాగైనా థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సినిమాకి సంబంధించిన మొదటి పాట ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

 డిజిటల్ వరల్డ్ లో 200మిలియన్ వ్యూవ్స్

డిజిటల్ వరల్డ్ లో 200మిలియన్ వ్యూవ్స్

నీలి నీలి ఆకాశం అనే సాంగ్ యూ ట్యూబ్ లో సంచలన రికార్డు సృష్టించింది. డిజిటల్ వరల్డ్ లో 200మిలియన్ వ్యూవ్స్ సాధించినట్లు చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్స్ ద్వారా ప్రమోషన్స్ డోస్ కూడా పెంచుతోంది. అయితే సినిమా విడుదల కాకముందే ఒకే ఒక్క పాటతో మంచి ఆదాయాన్ని అందించింది. 200మిలియన్ వ్యూవ్స్ లెక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.

ఆ లెక్కలన్ని కలిపితే..

ఆ లెక్కలన్ని కలిపితే..

సాధారణంగా ఒక మిలియన్ వ్యూవ్స్ కి 500ల డాలర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక లెక్కలని కలిపితే 200మిలియన్స్ వ్యూవ్స్ కి దాదాపు లక్ష డాలర్లు అప్ లోడర్ కు దక్కే అవకాశం ఉంటుంది. అంటే మన కరెన్సీలో 70లక్షల ఆదాయం యూ ట్యూబ్ ద్వారానే వచ్చి ఉంటుందని టాక్. ఇక సాంగ్ ని ఇతర మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ లకు కూడా అమ్మి ఉంటారు కాబట్టి నిర్మాతలకు బాగానే ఆదాయం వచ్చి ఉంటుంది.

Recommended Video

Anchor Pradeep Machiraju Cooking Video | బెండకాయ వేపుడు వండుతున్న యాంకర్ ప్రదీప్
నీలి నీలి ఆకాశం.. ఆదాయం బాగానే ఉంది

నీలి నీలి ఆకాశం.. ఆదాయం బాగానే ఉంది

మొత్తంగా నీలి నీలి ఆకాశం సాంగ్ కోటి రూపాయలకు పైగానే బిజినెస్ చేసిందనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ సాంగ్ ని అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా స్టార్ సింగర్స్ సిద్ శ్రీరామ్, సునీత పాడారు. ఇక 30రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాకు మున్నా దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడు ఇంతకుముందు. సుకుమార్ వద్ద పలు సినిమాలకు సహాయక దర్శకుడిగా పని చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X