పారిపోలేదు, నేను చేసింది తప్పే: యాంకర్ ప్రదీప్ పశ్చాత్తాపం
Recommended Video

డిసెంబర్ 31వ తేదీ రాత్రి యాంకర్ ప్రదీప్ మాచిరాజు అతిగా మద్యం సేవించి కారు నడుపుతూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు సూచించిన ప్రకారం అతడు కౌన్సిలింగుకు హజరు కాక పోవడం, పోలీసులు ఇంటికి వెళ్లినా తాళం వేసి ఉండటంతో....మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. జైలు శిక్ష పడే అవకాశం ఉండటంతో ప్రదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని, కేసు నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ ప్రచారం మొదలైంది.

తొలిసారి స్పందించిన ప్రదీప్
గత నాలుగు రోజులుగా ఎవరికీ కనిపించకుండా పోయిన ప్రదీప్ శుక్రవారం ఓ వీడియో సందేశం ద్వారా అభిమానుల ముందుకు వచ్చారు. ఇన్నాళ్లు తాను కనిపించకుండా పోవడానికి గల కారణం వెల్లడించారు.

లా ప్రకారం ఫాలో అవుతున్నా
‘అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ మాచి రాజు. డిసెంబర్ 31 రాత్రి జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిందే. దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్‌ను ‘లా' ప్రకారం ఫాలో అవుతున్నాను. నాకొచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం కౌన్సిలింగుకు, ఇతర ప్రొసీడింగ్స్ అన్నింటికీ అటెండ్ కాబోతున్నాను.... అని ప్రదీప్ తెలిపారు.

షూటింగ్స్ వల్లనే కనిపించలేదు
గడిచిన 4 రోజులుగా నేను ముందుగా కమిటైన షూటింగులు ఉండటం వల్ల ఆ షూటింగ్స్ అన్నీ అటెండ్ అవ్వడం జరుగుతోంది. బయట చాలా మంది కంగారు పడుతున్నారు. నేను అందుబాటులో లేను అని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రదీప్ తెలిపారు.

మీడియా మిత్రులకు తెలియజేయునది ఏమనగా
షూటింగులో ఉండటం వల్ల నేను ఎవరికీ రీచబుల్‌గా లేక పోయాను. కంటిన్యూస్‌గా ఫోన్స్ మ్రోగడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ కూడా మిస్సయి ఉండొచ్చు. దయచేసి నా మీడియా మిత్రులకు కానీ, ప్రేక్షకులకు కానీ నేను తెలియజేసేది ఏమనగా ప్రాపర్‌గా ‘లా' ప్రకారం ఏయే ప్రొసీడింగ్స్ ఉంటాయో అన్నీ ఫాలో అవుతాను.... ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అని యాంకర్ ప్రదీప్ తెలిపారు.

దురదృష్ట వశాత్తు ఉల్లంఘించాను
గతేడాది నేను ఒక వీడియో ద్వారా నేను ట్రాఫిక్ రూల్స్ గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని ప్రచారం చేసిన మాట నిజమే. దురదృష్ట వశాత్తు నేను వాటిని ఉల్లంఘించాను.... అని యాంకర్ ప్రదీప్ పశ్చాత్తాప పడ్డారు.
నేను చేసిన తప్పు ఎవరూ చేయొద్దు
అందరికీ తెలియజేసేది ఏమనగా నేను చేసిన తప్పు ఇంకా ఎవరూ చేయకూడదు అని కోరుకుంటున్నాను. అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను.... అంటూ ప్రదీప్ ముగించారు.


Click it and Unblock the Notifications











