యాంకర్ ప్రదీప్ హీరోగా సినిమా రాబోతోంది,ఇదిగో వివరాలు!

యాంకర్ ప్రదీప్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లబోతున్నాడు. హీరోగా సినిమా చేయబోతున్నాడు. అజయ్ సాయి మణికందన్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది. జనవరిలో మూవీ లాంచ్ కానుంది.

By Bojja Kumar

ప్రస్తుతం తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో నెం.1 మేల్ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ మాచిరాజు. తెలుగు టీవీ రంగంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ యాంకర్ త్వరలో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లబోతున్నాడు.

ఇప్పటి వరకు బుల్లితెరపై తన హవా కొనసాగిస్తున్న ప్రదీప్ త్వరలో వెండి తెరపై హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రదీప్ హీరోగా చేయబోయే తొలి సినిమాకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. ఈ విషయం ఇపుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.

ఎవరి దర్శకత్వంలో రాబోతోంది

ఎవరి దర్శకత్వంలో రాబోతోంది

విశ్వనీయ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.... ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్‌గా పేరున్న అజయ్ సాయి మణికందన్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

ప్రదీప్ తొలి సినిమా ఎలా ఉండబోతోంది

ప్రదీప్ తొలి సినిమా ఎలా ఉండబోతోంది

ప్రదీప్ బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యేలా కామెడీ ఎంటర్టెనర్‌లా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా జోడించి ఈ సినిమా స్క్రిప్టు సిద్ధం చేశారని తెలుస్తోంది.

ఎప్పుడు మొదలు కాబోతోంది?

ఎప్పుడు మొదలు కాబోతోంది?

ప్రదీప్, అజయ్ సాయి మణికందన్ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం జనవరి 2018లో అఫీషియల్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.

తక్కువ సమయంలోనే పాపులరైన ప్రదీప్

తక్కువ సమయంలోనే పాపులరైన ప్రదీప్

యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ప్రదీప్ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యాడు. ‘గడసరి అత్త సొగసరి కోడలు', ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా' లాంటి కార్యక్రమాలు బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం టీవీ కమిట్మెంట్లతో ప్రదీప్ తీరిక లేకుండా గడుపుతున్నాడు.

సినిమాలు కూడా చేశాడు

సినిమాలు కూడా చేశాడు

ఓ వైపు టీవీ షోలు చేస్తూనే ప్రదీప్ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. అయితే అవన్నీ పెద్దగా గుర్తింపు లేని పాత్రలే. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రదీప్‌కు బెస్టాఫ్ లక్ చెబుదాం.

కోట్ల కట్నం, పెళ్లి అంటూ ప్రదీప్ మీద వార్తలు

కోట్ల కట్నం, పెళ్లి అంటూ ప్రదీప్ మీద వార్తలు

కొన్ని రోజుల క్రితం ప్రదీప్ పెళ్లి వార్తలతో హాట్ టాపిక్ అయ్యాడు. ప్రదీప్‌కు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయని, కొందరు తమ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కోట్లలో కట్నం ఇస్తాంటూ ఆఫర్ చేస్తున్నారని ప్రచారం జరుగింది.

అందులో నిజం లేదా?

అందులో నిజం లేదా?


ప్రదీప్ సమాజిక వర్గానికే చెందిన విశాఖ రియల్టర్ ఒకరు ప్రదీప్‌ను తన అల్లుడిగా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆయనకు విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో భారీగా ఆస్తులు ఉన్నాయని, ఆ రియల్ట్ కూతురు ప్రస్తుతం యూఎస్ఏలో ఎమ్మెస్ చేస్తోందని, ఆమెను పెళ్లి చేసుకుంటే ప్రదీప్‌కు దాదాపు రూ. 25 కోట్ల కట్నంతో పాటు హైదరాబాద్ లో ఖరీదైన ఫ్లాటు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ గానే మిగిలియాయి. ప్రదీప్ నుండి ఈ వార్తలపై ఎలాంటి స్పందన రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X