twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది చూశాక కూడా రైట్ అనిపిస్తోందా?.. కోడి పందెలపై యాంకర్ రష్మీ కామెంట్స్

    |

    ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంత సున్నితంగా మారిపోయారో అందరికీ తెలిసిందే. ప్రతీ చిన్న విషయానికి మనోభావాలు దెబ్బతింటుంటాయి. కుల, మత ప్రాతిపదికపై వచ్చే విషయాలు, వివాదాల్లో మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక కొందరు మాత్రం జంతు ప్రేమికులు సోషల్ మీడియాలో మూగ ప్రాణుల గురించి మాట్లాడుతుంటారు. కుక్కలు, కోళ్లు వంటి వాటి గురించి మాట్లాడతారు. అయితే అలాంటి వారిపై రివర్స్ కౌంటర్ వేస్తూ.. ఆవుల గురించి ఎందుకు మాట్లాడరని ఇంకొందరు కామెంట్లు చేస్తుంటారు.

    కోడిపందెలపై..

    కోడిపందెలపై..


    సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతీ సారి కోడిపందెలపై చర్చలు జరుగుతుంటాయి. కొన్ని చోట్ల ఇది సంప్రదాయంగా నడుస్తూ వస్తోంది. కోడిపందెలు నిర్వహించకూడదని కొందరు కేసులు వేయడం, గొడవలు చేయడం వంటివి జరుగుతుంటాయి. ఈ సారి కూడా అలాంటి ఘటనలే జరిగాయి.

    ఓ వీడియో..

    తాజాగా యాంకర్ రష్మీ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో కోడి పందెల పేరిట వాటిని ఎంతలా హింసిస్తారో చూపించింది. అందులో వాటి కాళ్లకు బ్లేడులను, కత్తులను పెడతారు.. ఎదుటి కోళ్లను చంపేలా చేస్తుంటారని కోడి పందెలపై ఓ వీడియోను షేర్ చేసింది. అందులో కోళ్లు గాయాల పాలై చనిపోతుంటాయి.

    రష్మీ కామెంట్స్..

    రష్మీ కామెంట్స్..

    ఆ వీడియోను షేర్ చేస్తూ రష్మీ కొన్ని కామెంట్స్ చేసింది. దాన్ని చూశాక కూడా మీరు సంప్రదాయాలు, పండుగల పేరిట జంతువులను హింసించడం న్యాయమే, రైటే అని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. ఇంకా అలానే ఫీలైతే ఆ దేవుడే మనల్ని కాపాడాలి. నేను బక్రీద్‌లో జరిగే ఘటనలపైనా స్పందించాను.. మళ్లీ హిందువుల పండుగలపైనే స్పందిస్తాను అని తప్పుగా భావించకండని చెప్పుకొచ్చింది.

    పండుగ అంటే అదే..

    పండుగ అంటే అదే..


    నైలాన్, మాంజాలను వాడకండి.. సంతోషాన్ని పంచడమే పండుగల ముఖ్య ఉద్దేశ్యం. అది రక్తం చిందించడంతో ఎన్నడూ జరగదంటూ రష్మీ చెప్పుకొచ్చింది. అయితే ఈ రష్మీ చేసిన పోస్ట్‌పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. చికెన్ మటన్‌లు తిన్నప్పుడు అది గుర్తుకు రాదా? చికెన్ 65లు ఎలా తింటున్నారు మరి? అని ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం రష్మీ మంచి పని చేసిందంటూ ప్రశంసలుకురిపిస్తున్నారు.

    English summary
    Anchor Rashmi About Cock Fight In Sankranthi Festival
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X