ఇక ఆయనే మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలి.. ఆలోచించేలా చేస్తోన్న యాంకర్ రష్మీ

యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తెరపై కనిపించే రష్మీకి తెర వెనకలా ఉండే రష్మికి ఎంతో తేడా ఉంటుంది. తెరపై అందాలను ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. నిజ జీవితంలో మూగ జీవాల కోసం పాటు పాడుతూ ఉంటుంది. మూగ జీవాలను సంరక్షిస్తూ వాటి కోసం నిలబడుతూ ఉంటుంది. లాక్డౌన్ సమయంలో అయితే వీధి కుక్కల కోసం రష్మీ తపించిపోయింది.

అలా సేవా కార్యక్రమాలు..

అలా సేవా కార్యక్రమాలు..

లాక్డౌన్, కరోనా సమయంలో వీధి కుక్కల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ క్షణంలో తిండి లేక ఎన్నో జీవాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఆ సమయంలో వాటికి ఆహారాన్ని ఇచ్చేందుకు స్వయంగా వీధులకెక్కింది రష్మీ. ఆ సమయంలో ఎక్కువగా రష్మీ మూగ జీవాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసింది.

అలా ఖండించడం..

అలా ఖండించడం..

రష్మీ సందర్భానుసారంగా జీవాల జరిగే హింసపై ఖండిస్తూనేఉంటుంది. సంప్రదాయాల పేరిట జంతువులను, పశువులను హింసించడం, చంపడం వంటివాటిపై సోషల్ మీడియాలో అందరినీ ప్రశ్నిస్తుంటుంది రష్మీ. అలా ఎన్నో సార్లు ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది రష్మీ.

రీసెంట్‌గా అలా..

రీసెంట్‌గా అలా..

ఈ మధ్యే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అందరూ గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు. కానీ రష్మీ దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. మహిళా దినోత్సం అని శుభాకాంక్షలు చెప్పకండి.. చేతల్లో చూపించండి అని ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఓ మహిళను కొందరు దారుణంగా దూషించడం కనిపించింది. ఓ వీధి కుక్కకు ఆహారాన్ని పెడుతున్నందుకు ఓ మహిళను దారుణంగా అవమానించారు. దానిపై రష్మీ సీరియస్ అయింది.

తాజాగా ఇలా..

తాజాగా ఇలా..

అలా నాటి ఘటనను వివరిస్తూ.. ఆకలితో ఉన్న ఓ కుక్కకు అన్నం పెడితే ఎంతో పుణ్యం వస్తుందని.. దైవ భక్తికి ఇదో మార్గమని.. అలా చేస్తే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయని కాళ భైరవుడు చెప్పాడంటూ ఓ పోస్ట్ చేసింది రష్మీ.

జ్ఞానోదయం..

జ్ఞానోదయం..

అలా వీధి కుక్కలను జాగ్రత్తగా చూసుకోవాలి.. ఆకలితో ఉంటే అన్నం పెట్టాలనే ఉద్దేశ్యంతో రష్మీ ఈ పోస్ట్ చేసింది. ఈ విశ్వానికి తండ్రి అయిన ఆ పరమాత్ముడే ఇక మనందరికీ జ్ఞానోదయం కలిగించాలి.. అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X