అసలు రంగు బయటపెట్టిన రష్మీ.. ఫోన్ నెంబర్ అడిగి అడ్డంగా బుక్కయ్యాడు!

Recommended Video

Anchor Rashmi Exposes Fake Guy In Social Media | FilmiBeat Telugu

చిత్ర పరిశ్రమలో దర్శకులమని, అసిస్టెంట్ దర్శకులమని, మేనేజర్లమని చెప్పుకుంటూ యువతులని మోసం చేసే సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలపై తరచుగా పోలీస్ కేసులు నమోదు కావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా యాంకర్ రష్మీకి అలాంటి సంఘటనే ఎదురైంది. కానీ అతడి అసలు రంగుని బయట పెట్టిన రష్మీ గట్టిగా బుద్ది చెప్పింది. రష్మీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రస్తుం ప్రశ్నకు సమాధానం ఇస్తున్న సంగతి తెలిసిందే.

యాడ్ షూట్ కోసం

యాడ్ షూట్ కోసం

ఓ నెటిజన్ రష్మీకి ట్వీట్ చేస్తూ.. మీ తండ్రి నంబర్ కావాలని రిక్వస్ట్ చేశాడు. ఓ యాడ్ షూట్ కోసం మిమ్మల్ని సంప్రదించాలని అనుకుంటున్నాం. మీ నాన్న ఫోన్ నంబర్ మిస్ అయింది. దయచేసి మీనాన్న నంబర్ నాకు మెసేజ్ చేయండి అని రిక్వస్ట్ చేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు పిఆర్ మేనేజ్‌మెంట్ తరుపున మాట్లాడుతున్నట్లు తెలిపాడు. ఈ ట్వీట్ చూసి రష్మిక ఆశ్చర్యపోయింది. అతడికి సరైన సమాధానం ఇచ్చింది.

అడ్డంగా బుక్కయ్యాడు

నా చిన్నతనంలోనే మా నాన్న మరణించారు. ఇక ఆయన నంబర్ నీదగ్గర ఎందుకు ఉంటుంది. పిఆర్ మేనేజ్మెంట్ పేరుతో పూల్స్ చేయాలని ప్రయత్నించకు. అమ్మాయిలని చీట్ చేయడానికి, వారితో మాట్లాడడానికి ఇదో వంక. నీలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది అని రష్మీ అతడి అసలు రంగు బయట పెట్టింది.

ఆ బాధ్యత ఉంది

ఆ బాధ్యత ఉంది

రష్మీ ఇచ్చిన సమాధానంపై మరో నెటిజన్ స్పందించాడు. మేడం ఇలాంటి ట్వీట్స్‌పై స్పందించి మీ సమయం వృధా చేసుకుకోకండి అని తెలిపాడు. రష్మీబదులిస్తూ .. ఎప్పుడూ మనకోసమే ఆలోచించకూడదు. ఇలాంటి విషయాలపై స్పందించాల్సిన బాధ్యత ఉంది అని రష్మీ తెలిపింది. ఈ మధ్య రష్మీ హార్డ్ హిట్టర్‌గా మారిపోతోంది.. ప్రతి బంతి సిక్సరే అని మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు.

ధీటుగా సమాధానాలు

ధీటుగా సమాధానాలు

సోషల్ మీడియాలో నెటిజన్లు చేసే కామెంట్స్, విమర్శలకు రష్మీ ఇటీవల ధీటుగా సమాధానాలు ఇస్తోంది. ఆ మధ్యన సినీతారలు పొట్టి బట్టలు వేసుకోవడంపై జరిగిన వివాదంలో రష్మీ రకుల్ ప్రీత్‌కు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. నాగబాబు చేసిన వ్యాఖ్యలని సమర్థించింది. జబర్దస్త్ యాంకర్‌గా రష్మీ మంచి గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X