పొట్టి గౌనులో పిచ్చెక్కిస్తోంది.. అగ్గి రాజేస్తోన్న యాంకర్ రష్మీ
యాంకర్ రష్మీ బుల్లితెరపై చేసే అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రష్మీ ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ షోలతో బిజీగా ఉంది. ఇవి కాకుండా రష్మీ మరేతర షోలు, స్పెషల్ ఈవెంట్లలోను కనిపించదు. కొన్ని ప్రత్యేక పండుగలకు చేసే ఈవెంట్లలో మాత్రమే కనిపిస్తుంటుంది. అలా రష్మీ బుల్లితెరపై కాకుండా సోషల్ మీడియాలో కొత్త కోణంలో కనిపిస్తుంటుంది. సోషల్ మీడియాలో రష్మీకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది.

తెరపై అలా..
రష్మీ వెండితెరపై హాట్ లుక్కులో కనిపిస్తూ ఉంటుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కాకుండా గ్లామర్ షో, స్కిన్ షోకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ రష్మీ అందాలకు వెండితెరపై అంతగా అవకాశాలు రాలేకపోయాయి. బుల్లితెరపై మాత్రం రష్మీ ఫాలోయింగ్ నానాటికీ పెరుగుతూనే ఉంది.

సోషల్ మీడియాతో క్రేజ్..
తెరపై రష్మీ ఎలా కనిపించినా కూడా నిజ జీవితంలో, సోషల్ మీడియాలో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఆమె చేసే సేవా కార్యక్రమాలు, మానవత్వం, మూగ జీవాల కోసం పాటు పడే గుణం, ప్రకృతి గురించి ఆలోచించడం వంటి విషయాలతో సోషల్ మీడియాలో మంచి పేరు సంపాదించుకుంది.

మూగజీవాల కోసం..
రష్మీ ఎక్కువగా మూగజీవాల కోసం పాటు పడుతూ ఉంటుంది. తన పెట్స్‌ను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది. వీధికుక్కలను సైతం కాపాడుతూ స్వచ్చంద సంస్థలకు అప్పగిస్తూ ఉంటుంది. పెట్స్‌ను షాప్‌లో విక్రయించకండి.. దత్తత తీసుకోండని అవగాహన కలిగిస్తూ ఉంటుంది.

ఫోటో షూట్లతో రచ్చ..
ఓ వైపు అలా సామాజిక కార్యక్రమాలు చేస్తూనే తెరపై రచ్చ రచ్చ చేస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలో రష్మీ షేర్ చేసే ఫోటో షూట్లు అప్పుడప్పుడు హాట్ టాపిక్ అవుతుంటాయి. గత వారం రష్మీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఎద అందాలతో వల వేసిన రష్మీ అందరినీ కట్టిపడేసింది.

పొట్టి గౌనులో..
తాజాగా రష్మీ పొట్టి గౌనులో దర్శనమిచ్చింది. నేటి ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో ఇలా పొట్టి గౌనులోనే కనిపించబోతోంది. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా రష్మీ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో మంట పుట్టిస్తున్నాయి. రకరకాల కామెంట్లతో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











