వ్యక్తిని ఢీ కొట్టిన యాంకర్ రష్మీ కారు.. పరిస్థితి విషమం!
Recommended Video

ప్రముఖ టాలీవుడ్ యాంకర్ రష్మీ జబర్దస్త్ తో పాపులర్ అయింది. హీరోయిన్ గా కూడా పలు చిత్రాల్లో నటించింది. గ్లామర్ తో పాటు, బోల్డ్ గా ఉండడం, చలాకీదనంతో రష్మీ అందరిని ఆకట్టుకుంటోంది. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం అంతకు మించి. ఆ చిత్రం సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం రష్మీ జబర్దస్త్, ఢీ జోడి షోలలో పాల్గొంటోంది. ఇదిలా ఉండగా రష్మీ అనుకోని చిక్కుల్లో చుక్కుకుంది. రష్మీ ప్రయాణిస్తున్న కారు ఓ ప్రమాదానికి కారణం అయింది. ఆ వివరాలు చూద్దాం!

కొత్త కారు
యాంకర్ రష్మీ ఇటీవల కొత్త కారుని తీసుకుందట. ఆ కారులో విశాఖ సమీపంలో ప్రయాణిస్తుండగా ఆదివారం రాత్రి 11 గంటలకు ప్రమాదం చోటు చేసుకుంది. రష్మీ ప్రయాణిస్తున్న కారు కూర్మన్నపాళెం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది.

పరిస్థితి విషమం
ప్రమాదం జరిగిన వెంటనే అతడిని దగ్గర్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి వైజాగ్ లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన తర్వాత రష్మీ మరో వాహనంలో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో రష్మీ లీగల్ గా చర్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎవరు నడిపారు
ప్రమాదం జరిగిన సమయంలో కారుని ఎవరు డ్రైవ్ చేశారనే విషయం కీలకం కానుంది. కారుని రష్మీ నడుపుతోందా లేక వేరే డ్రైవరా అనే విషయం తేలాల్సి ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి రష్మీ ఇంతవరకు స్పందించలేదు. పోలిసుల నుంచి కూడా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

గ్లామరస్ యాంకర్‌గా
జబర్డస్త్ తో యాంకర్‌గా మారిన రష్మీ గుంటూరు టాకీస్, అంతకు మించి చిత్రాల్లో అందాలు ఆరబోసి నటించింది. ఎలాంటి విషయం గురించి అయినా బోల్డ్ గా మాట్లాడుతూ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం రష్మీ కొన్ని చిత్రాల్లో నటిగా అవకాశాలు అందుకుంటోంది. తనపై విమర్శలు చేసేవారికి ఘాటుగా సమాధానాలు ఇస్తూ సోషల్ మీడియాలో రష్మీ యాక్టీవ్‌గా ఉంటుంది.


Click it and Unblock the Notifications











