Rashmi Gautam Tweet: ఆ రేపిస్టు నుంచి కాపాడండి.. కలకలం రేపుతున్న రష్మి ట్వీట్
యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టి.. నటిగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక రష్మి యానిమల్ లవర్ అనే విషయం అందరికీ తెలిసిందే. మూగజీవాల హింసకు గురైతే.. ఆమె వెంటనే స్పందిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది ఆమెను విమర్శిస్తుంటారు కూడా. ఇదిలా ఉంటే... ఇటీవల వ్యక్తి పెట్ డాగ్ ను హింసిస్తున్న వీడియో రష్మీ దృష్టికి వచ్చింది. ఆ కుక్క పిల్లని కాపాడాలంటూ రష్మీ.. మీడియా వేదికగా పోస్టులు పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే...
రష్మి తల్లి ఒడిషా రాష్ట్రానికి చెందినవారు కాగా... తండ్రి ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారు. అయితే రష్మీ విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. చిత్ర పరిశ్రమ కోసం హైదరాబాదుకు వచ్చింది. 2002లో రష్మీ సవ్వడి అనే చిత్రంలో నటించగా.. ఆ చిత్రం రిలీజ్ కాలేదు. ఇక ఉదయ్ కిరణ్ హోలీ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సినిమాల్లో సపోర్టింగ్ రోల్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక జబర్ధస్త్ ప్రోగ్రామ్ తో యాంకర్ గా మారిన రష్మీకి మంచి పాపులారిటీ వచ్చింది. అప్పటికే ఉన్న అనసూయకు పోటీగా .. రష్మీ కూడా అందాల ప్రదర్శన స్టార్ట్ చేసింది.

ఆ మధ్య గుంటూరు టాకీస్ చిత్రంలో అందాలను ఆరబోస్తూ.. ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. పలు సినిమాల్లో నటిస్తూ.. క్రేజ్ అయితే సంపాదించుకుంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రష్మీ. తన ఫోటోలను షేర్ చేస్తూ.. నెటిజన్లను ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇక సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య ఏదో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ అవి కేవలం షో వరకే నని.. బయట ఫ్రెండ్ మాత్రమేనని చెప్పుకువచ్చారు. కూడా.
అయితే రష్మీ ఎంత అందంగా ఉంటుందో.. తన మనసు కూడా అంతే అందంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఆమె ఓ యానిమల్ లవర్. ఎక్కడ మూగజీవాలు హింసకు గురైనా వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఈ క్రమంలో ఆమె కొంత వ్యతిరేకత కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి పెట్ డాగ్ ని హింసిస్తున్న వీడియో రష్మీ దృష్టికి వచ్చింది. రష్మీ... ఆ కుక్క పిల్లను కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంది. దిల్లీ పోలీసులు, పెటా సంస్థ, ఎంపీ మేనకా సంజయ్ గాంధీలను సదరు ట్వీట్ లో ట్యాగ్ చేసింది.

రష్మీ చేసిన ట్వీట్ లో.... అతడు చాలా క్రూయల్.. అతని వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా ప్రమాదమే. పిల్లలను లైంగికంగా వేధించేవాడు.. రేపిస్ట్ కూడా కావొచ్చు... అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. బక్రీద్ పండుగ రోజున రష్మీ ఈ హింసను వ్యతిరేకించింది. ఇక ముస్లిం సోసైటీ కూడా ఆమెపై మండిపడుతోంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నగరంలో బాలుడిపై కుక్కల దాడి జరగ్గా... రష్మీపై కూడా విమర్శలు వచ్చాయి.
రష్మీ లాంటి వాళ్ల వల్ల.. కుక్కలు పెరిగిపోతున్నాయంటూ కొంతమంది నెటిజన్స్ ఫైర్ అయ్యారు. అయినా రష్మీ మాత్రం తగ్గలేదు. మూగా జీవల కోసం.. తన వంతు కృషి చేస్తూ వస్తోంది. రష్మీ విషయానికి వస్తే.. ప్యూర్ వీగన్. ఆమె మాంసం, గుడ్లే కాదు, పాలు, పాల పదార్థాలు కూడా తినదు. మరోవైపు రష్మీ యాంకర్ గా సత్తా చాటుతూనే... ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో యాంకర్ గా చేస్తోంది. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. అది అంతగా ఆకట్టుకోలేదు.


Click it and Unblock the Notifications











