తనపై హాట్ కామెంట్స్ చేసిన దర్శకుడిపై... రష్మి రియాక్షన్ ఇదీ!

By Bojja Kumar

Recommended Video

Anchor Rashmi Speech @Anthaku Minchi Movie Trailer Launch

రష్మి నటించిన 'అంతకు మించి' మూవీ ఆగస్టు 24న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రష్మి మీద చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఫిల్మ్ నగర్లో 'అంతకు మించి' పోస్టర్ చూసినపుడు అందులో రష్మి తొడలు, వెనకల సముద్రం సీన్ చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది అంటూ వ్యాఖ్యానించారు. దర్శకుడి కామెంట్లపై రష్మి తనదైన శైలిలో స్పందించారు.

మీ ప్రశంసలు మరిచిపోలేను: రష్మి

మీ ప్రశంసలు మరిచిపోలేను: రష్మి

అజయ్ భూపతి కామెంట్లపై రష్మి రియాక్ట్ అవుతూ... మా సినిమా క్రాష్ ప్రమోషన్స్ చేయడంతో పాటు పోస్టర్‌తో కనెక్ట్ అయినందుకు థాంక్స్. మీ ప్రశంసలు ఎప్పటికీ మరిచిపోలేను.... అంటూ సమాధానం ఇచ్చింది.

రెండు సంవత్సరాలు కష్టపడ్డాం

రెండు సంవత్సరాలు కష్టపడ్డాం

ఒక సినిమా అనేది కేవలం ఒకరి కష్టం కాదు. అందరూ కలిసి కష్టపడితేనే ఇది సాధ్యం అవుతుంది. దాని వెనక రాత్రింభవళ్లు ఎంతో మంది హార్డ్ వర్క్ ఉంటుంది. మేము ఈ సినిమా పూర్తి చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది. డబ్బు ఖర్చు పెట్టే నిర్మాతలపై ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసు. ఈ రోజు ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే నిర్మాతల ముఖంలో సంతోషం కనిపిస్తోంది... అని రష్మి వ్యాఖ్యానించారు.

చాలా సార్లు క్లాష్ అయింది

చాలా సార్లు క్లాష్ అయింది

టెక్నికల్‌గా ఈ చిత్రంలో చాలా ప్రత్యేకతలు ఉన్నయి. సౌండ్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ డేట్స్, నా టీవీ షోలతో చాలా సార్లు క్లాష్ అయింది. అటు టీవీ షోలు చేస్తూ, ఇటు సినిమా షూటింగుల్లో పాల్గొంటూ చాలా అలసిపోయి ఉండేదాన్ని. ఆ సమయంలో డైరెక్టర్ చెప్పే సలహాలు నాకు ఎంతో ఎనర్జీని ఇచ్చాయని తెలిపారు.

డూప్ లేకుండా రష్మి స్టంట్స్

డూప్ లేకుండా రష్మి స్టంట్స్

ఈ సినిమా ఎక్కువ శాతం నైట్ షూట్స్ జరిగాయి. అంతా హ్యాపీగా జరిగిపోయింది. ఇందులో నేను ఎలాంటి డూప్ లేకుండా చాలా స్టంట్స్ చేశాను. ట్రైలర్లో ఎక్కువ శాతం పాట పెట్టాను. కానీ సినిమాలో ఒక మంచి స్టోరీ ఉంది. నాతో పాటు అందరికీ పెర్ఫార్మెన్స్ కు చాలా స్కోప్ ఉంది. సినిమా టైటిల్ కు తగిన విధంగానే అంతకు మించి అనేలా ఉంటుందని రష్మి తెలిపారు.

అంతకు మించి

అంతకు మించి

జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంతకు మించి'. యూ అండ్ ఐ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో ఎస్.జై. ఫిలిమ్స్ పతాకంపై సతీష్, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించారు. జానీ దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X