జబర్దస్త్ యాంకర్ రష్మి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

By Bojja Kumar

Recommended Video

Rashmi Birthday Celebrations With Anasuya

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రష్మి పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. తన పుట్టినరోజుకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరో యాంకర్ అనసూయ కూడా రష్మిని విష్ చేస్తూ ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రష్మిని విష్ చేస్తూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు.

 యాంకర్ రష్మి

యాంకర్ రష్మి

ఇటు టీవీ షోలు చేస్తూనే అటు సినిమాల్లో సెలెక్టెడ్‌ పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది రష్మి. జబర్దస్త్ ఎంట్రీ కంటే ముందే రష్మి కొన్ని సినిమాల్లో నటించారు. అయితే గుర్తింపు, పాపులారిటీ వచ్చింది మాత్రం జబర్దస్త్ టీవీ షో ద్వారానే.

2002లోనే ఇండస్ట్రీకీ

2002లోనే ఇండస్ట్రీకీ

2002 లో సవ్వడి అనే సినిమాతో రష్మి సినిమా కెరీర్ ప్రారంభమైంది. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన హోలీ సినిమాలో షాలు పాత్రలో సపోర్టింగ్ రోల్ చేసింది.

 టీవీ కార్యక్రమాలు, సినిమాలు

టీవీ కార్యక్రమాలు, సినిమాలు

2007లో వనిత టీవీలో ‘యువ' అనే కార్యక్రమం రష్మి చేశారు. 2010లో తెలుగులో వచ్చిన ‘ప్రస్థానం' చిత్రంలో రష్మి సహాయనటిగా చేసింది. ఆ తరువాత ఒక రియాలిటీ డ్యాన్స్ షోలో రష్మి డ్యాన్స్ చూసిన నటి సంగీత ‘కందెన్' సినిమా అనే తమిళ సినిమాలో అవకాశం ఇప్పించింది. 2011లో వచ్చిన కందెన్ రష్మి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

జబర్దస్త్‌తో రష్మి కెరీర్ టర్నింగ్

జబర్దస్త్‌తో రష్మి కెరీర్ టర్నింగ్

2013లో జబర్దస్త్ కామెడీ షోలో అవకాశం దక్కించుకున్న తర్వాత రష్మి కెరీర్ టర్న్ అయింది. ఈ షో ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకోవడంతో పాటు వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. చారుశీల, గుంటూరు టాకీస్, రాణిగారి బంగ్లా, అంతం, తను వచ్చెనంట చిత్రాల్లో రష్మి నటించింది.

రష్మిని విష్ చేస్తూ అనసూయ ట్వీట్

రష్మితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తనకు ఎంతో ఇష్టమైన స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యాంకర్ అనసూయ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X