నా క్యారెక్టర్ మీద కామెంట్స్ చేస్తే ఊరుకోవాలా? : యాంకర్ రష్మి

By Bojja Kumar

Recommended Video

Anchor Rashmi Talks About Bad Comments On Her In Social Media

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో యాంకర్ రష్మి ఒకరు. ట్విట్టర్లో అభిమానులతో టచ్‌లో ఉండే రష్మి సమయం దొరికినప్పుడల్లా వారితో లైవ్ చాట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు ఆమె అభ్యంతరకమైన కామెంట్స్ సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే వారి కామెంట్లకు కృంగిపోకుండా స్ట్రాంగ్‌గా రిప్లై ఇస్తూ తగిన బుద్ది చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. రష్మి నటించిన 'అంతకుమించి' చిత్రం ఆగస్టు 24న విడుదలవుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యాంకర్‌కు ఆ కామెంట్లకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

 మాలాంటి వారికి ఈ కామెంట్లు తప్పడం లేదు

మాలాంటి వారికి ఈ కామెంట్లు తప్పడం లేదు

కష్టపడి పని చేసే ప్రతి అమ్మాయిపై కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఎవరి సాయం లేకుండా ఎదిగిన అమ్మాయిలపై, సొంతగా సంపాదించుకునే మహిళలపై ఇలాంటి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తప్పటడం లేదు అని రష్మి అన్నారు.

ఫేక్ అకౌంట్స్ ద్వారానే ఇవన్నీ

ఫేక్ అకౌంట్స్ ద్వారానే ఇవన్నీ

సోషల్ మీడియా కొందరు చేసే కామెంట్స్ మరీ దారుణంగా ఉంటాయి. చాలా మంది ఫేక్ అకౌంట్లతో ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేస్తుంటారు. చాలా అకౌంట్లకు డిపీలు కూడా ఉండవు. పేర్లు కూడా వంకగా ఉంటాయి. నా పేరు తోపు... అనే పేర్లతో కూడా అకౌంట్స్ ఉంటాయి. అలాంటి వారిని పట్టించుకోను. ఒరిజినల్ ప్రొఫైల్స్ ఉన్న అకౌంట్లకు నేను రిప్లై ఇస్తుంటాను.

మేము వేసుకునే బట్టల మీదే కామెంట్స్

మేము వేసుకునే బట్టల మీదే కామెంట్స్

చాలా మంది మేము వేసుకునే బట్టలపై కామెంట్స్ చేస్తారు. లేకుంటే మా మధ్య పుల్లలు (గొడవలు) పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. మీకుంటే ఆమె బెటర్, ఆమె కంటే మీరు బెటర్ అంటూ మా మధ్య వైషమ్యాలు పెంచే కామెంట్స్ చేస్తుంటారు. ఇలాంటివి అక్కడిక్కడే ఆపేస్తుంటాను. అలాంటి వారిని ఎంకరేజ్ చేయను.

వారికి లేని ఇబ్బంది నాకెందుకు?

వారికి లేని ఇబ్బంది నాకెందుకు?

చాలా మంది సెలబ్రిటీలు ఫ్యాన్స్‌తో ఎందుకులే అని చాలా కూల్‌గా మాట్లాడుతుంటారు. రష్మి మాత్రం అగ్రెసివ్ గా, కోపంగా షార్ట్ టెంపర్‌గా మాట్లాడుతుంది అనే పేరుంది. ఇలా ప్రవర్తించడం మీ ఇమేజ్ దెబ్బ తీస్తుందని మీకు ఎప్పుడూ అనిపించలేదా? అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ... వాళ్లు కూల్‌గా మాట్లాడితే నేను కూడా కూల్‌గా రిప్లై ఇస్తాను. వాళ్లు అభ్యంతరకరంగా కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకోను. అలాంటి కామెంట్స్ చేయడం వారికే ఇబ్బంది లేనపుడు నా మీద వారు పెట్టే కామెంట్లకు రిప్లై ఇవ్వడానికి నేనెందుకు ఇబ్బంది పడాలి? అని రష్మి ప్రశ్నించారు.

 నా క్యారెక్టర్ గురించి మాట్లాడటానికి మీరెవరు?

నా క్యారెక్టర్ గురించి మాట్లాడటానికి మీరెవరు?

నన్ను, నా క్యారెక్టర్‌ను టార్గెట్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నా గురించి వారికేం తెలుసు? మీరేమీ నా బిల్స్ పే చేయడం లేదు, నేనెవరో, నా బ్యాగ్రౌండ్ ఏమిటో నీకు తెలియదు? నేనెక్కడి నుండి వచ్చానో, నా జీవితం గురించి, నా గతం గురించి ఏమీ మీకు తెలియదు. అయినా నన్ను జడ్ట్ చేస్తూ మాట్లాడుంటారు. నేనేమిటో నాకు తెలుసు. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, ఏది తప్పు ఏది రైట్ అనే ఆలోచించగలను. నా మీద అలాంటి కామెంట్స్ చేసే అర్హత మీకు లేదు అంటూ రష్మి తన దైన రీతిలో రియాక్ట్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X