తొడలపై కామెంట్స్: రష్మి రియాక్షన్, అనసూయను బూతులు తిట్టడంపై...!

By Bojja Kumar

ఒకప్పుడు 'గుంటూరు టాకీస్' సినిమాలో తన ఎక్స్ ఫోజింగ్, ముద్దు సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రష్మి.....అప్పటి వరకు తనలో ఎవరూ చూడని కోణం చూపించి మరింత పాపులర్ అయింది. అయితే ఆ సినిమా తర్వాత రష్మి పలు చిత్రాలు చేసినా ఏ చిత్రంలోనూ అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇవ్వలేదు. చాలా కాలం తర్వాత రష్మి గ్లామర్‌ పరంగా మరోసారి హాట్ టాపిక్ అయింది. ఆమె నటిస్తున్న తాజా మూవీ 'అంతకు మించి' ఆగస్టు 24న విడుదలకు సిద్దమవుతోంది.

Recommended Video

Anchor Rashmi Speech @Anthaku Minchi Movie Trailer Launch

ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్లు, ప్రమోషనల్ సాంగులో రష్మి హాట్ అండ్ సెక్సీ లుక్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి కూడా రష్మి థైస్(తొడలు) తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. కేవలం రష్మి ఇమేజ్‌, ఆమె హాట్ ఫోజులతోనే సినిమాకు ఇంత హైప్ వచ్చింది. ఈ పరిణామాలపై రష్మి స్పందించారు.

 శృతిమించిన గ్లామర్ కాదు

శృతిమించిన గ్లామర్ కాదు

ఇందులో శృతిమించిన గ్లామర్, ఎక్స్ ఫోజింగ్ ఉందని నేను భావించడం లేదు. ఇటీవల విడుదల చేసిన ప్రమోషనల్ సాంగులో కూడా సెన్సువల్ గ్లామర్ చూపించాం. కేవలం ప్రోమో చూసి సినిమాపై అభిప్రాయానికి రావొద్దు. స్టోరీలో మంచి కంటెంటు ఉంది, మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది అని రష్మి తెలిపారు.

తొడలపై కామెంట్లపై

తొడలపై కామెంట్లపై

చాలా మంది ఈ పోస్టర్లు చూసి మీ పెర్ఫార్మెన్స్ గురించి కాకుండా మీ థైస్(తొడలు) గురించి, ఫిజిక్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఒక నటిగా మీ అభిప్రాయం ఏమిటి? అనే ప్రశ్నకు రష్మి స్పందిస్తూ... థైస్ ఉన్నాయండి ఏం చేయమంటారు? పోస్టర్లో కనిపించింది కాబట్టి మాట్లాడుతున్నారు. ఇట్స్ ఓకే.... అంటూ రష్మి స్పందించారు.

కొత్తవారి నుండే అవకాశాలు

కొత్తవారి నుండే అవకాశాలు

మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాలు గమనిస్తే కొత్త దర్శకులతోనే ఎక్కువగా వెళుతున్నారు. హారర్ బేస్డ్ సినిమాలను ఎంచుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ... నన్ను అప్రోచ్ అయ్యేవారు ఎక్కువగా కొత్త దర్శకుడు, కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు. కథ నచ్చితే చేస్తున్నాను. నాకు మరో ఛాయిస్ లేదు. హారర్ స్టోరీకి గ్లామర్ యాడ్ చేయడం అనేది సక్సెస్ ఫార్ములా. నిర్మాత డబ్బులు పెట్టినపుడు వారు అవి తిరిగిరావాలని కోరుకుంటారు... అని రష్మి అన్నారు.

 గుంటూరు టాకీస్ రేంజిలో...

గుంటూరు టాకీస్ రేంజిలో...

‘గుంటూరు టాకీస్' లాంటి సక్సెస్ ‘అంతకు మించి' మూవీ కూడా అందుకుంటుంది అనే నమ్మకం అయితే ఉంది. చాలా కష్టపడి పని చేశాం. ఇన్ని మాటలు(తొడల గురించి) విన్నాం. తప్పకుండా రిజల్ట్ వస్తుందని భావిస్తున్నాను. సినిమా ఎక్కువ మందికి నచ్చాలని కోరుకుంటున్నానని తెలిపారు.

అలాంటి కామెంట్స్ బాధిస్తాయి

అలాంటి కామెంట్స్ బాధిస్తాయి

డ్రెస్సింగ్ విషయంలో మీపైగానీ, అనసూయపై కానీ ఇటీవల విమర్శలు వచ్చాయి. అనసూయ దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అనే ప్రశ్నిపై రష్మి రియాక్ట్ అవుతూ...

అనసూయ చాలా సెన్సిటివ్, ఏమైనా అంటే వెంటనే హర్ట్ అవుతుంది. మా డ్రెస్సింగ్ గురించి మీకు సమస్య ఉంటే అక్కడితో ఆపేస్తే ఒకే. కానీ ఫ్యామిలీ మీదకు వెళ్లిపోవడం, పిల్లలను, భర్తను, ఇంట్లో పెద్దవారిపై కామెంట్స్ చేయడం భాధిస్తుంది.

 ఎందుకు చేస్తారో అర్థం కాదు

ఎందుకు చేస్తారో అర్థం కాదు

డ్రెస్సింగ్ పరంగా చెప్పాలంటే..... ఇపుడు ఇదో పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇపుడు నేను చీరకట్టుకుని ఎంత పెద్ద క్రైమ్ చేసినా వదిలేస్తారా? నేను షార్ట్స్ వేసుకుని ఏం చేయకుండా ఉంటే విమర్శిస్తారా? నాకు నిజంగా అర్థం కాదు.

 బూతులు తిట్టడం అవసరమా?

బూతులు తిట్టడం అవసరమా?

జనాలు ఫంక్షన్ బట్టి డ్రెసింగ్ ఉండాలని కోరుకోవడం కరెక్టే. కానీ ఆమె ఎలాంటి పరిస్థితుల్లో అలా వెళ్లాల్సి వచ్చిందో కూడా అర్థం చేసుకోవాలి. నేను అడిగేది ఒకటే... అంత బూతులు తిట్టాల్సిన అవసరం ఉందా? అభిప్రాయాలు చెప్పడంలో తప్పు లేదు. కానీ తిడుతూ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. నువ్వొక ఆడదానివా? మన కల్చర్ నీకు తెలియదా? ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదు... అని రష్మి అన్నారు.

 అనసూయకు సమస్య ఉంది

అనసూయకు సమస్య ఉంది

నిజమైన అభిమానులు ఎవరూ బూతులు తిట్టరు. జెన్యూన్ గా చెబుతారు. గతంలో అలా చెప్పిన అభిమానుల అభిప్రాయాలను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశాం. అనసూయ రెండు కాళ్లకు సమస్య(లిగమెంట్ అయింది) ఉండటం వల్లనే అలాంటి డ్రెస్ వేసుకుందేమో? సమస్య ఉన్నా సరే ఆమె తన కమిట్మెంట్స్ పూర్తి చేస్తోంది.... అని రష్మి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X