రేప్ చేయడం లేదుగా.. సుధీర్ వయసులో ఉన్న కుర్రాడు, అమ్మాయిల వెంట పడడం కామన్.. రష్మీ!
జబర్దస్త్ యాంకర్ రష్మీకి ఉన్నది ఉన్నట్లు బోల్డ్ గా మాట్లాడడం అలవాటు. ఎలాంటి విషయాన్ని అయినా రష్మీ మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. తనపై వస్తున్న వ్యక్తిగత రూమర్స్ విషయాన్ని ప్రస్తావించడానికి కూడా వెనుకాడదు. రష్మీ ప్రస్తుతం అంతకు మించి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. ఓ ఇంటర్వ్యూ లో కాస్టింగ్ కౌచ్ గురించి, జబర్దస్త్ సుధీర్ గురించి రష్మీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కాస్టింగ్ కౌచ్
ప్రతి ఇండస్ట్రీలో ఇది సాధారణంగా అమ్మాయిలు, అబ్బాయిల మధ్య జరిగేదే. కానీ దానికి అంగీకరించేలా లేదా అనే ఛాయిస్ అమ్మాయిల చేతిలో ఉంటుంది. ఎవరూ రేప్ చేయరు, బలవంత పెట్టారు. జస్ట్ నో చెబితే చాలు అని రష్మీ తెలిపింది. కనీసం బలవంత పెట్టినా అది నేరమే అవుతుంది అని రష్మీ తెలిపింది.
Recommended Video


అడ్డదారిలో
కాస్టింగ్ కౌచ్ కి తలొగ్గకూడదని అమ్మాయిలంతా బలంగా నిర్ణయించుకున్నా అడ్డదారిలో పైకి రావాలని భావించే వారు ఎవరూ ఒకరు ఉంటారు. వారి వలన ఇండస్ట్రీని మొత్తం నిందించకూడదని రష్మీ తెలిపింది.

అమ్మాయిల వెంటపడడం
సుధీర్ పై వస్తున్న రూమర్స్ గురించి కూడా రష్మీ బోల్డ్ గా మాట్లాడింది. సుధీర్ ఎక్కువగా అమ్మాయిల వెంట తిరుగుతుంటాడు కదా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. సుధీర్ వయసులో ఉన్న కుర్రాడు. అమ్మాయిల వెంట తిరగడం కామనే కదా అంటూ సింపుల్ గా సమాధానం ఇచ్చింది. అదేదో మహా పాపం అయినట్లు బూతద్దంలో చూడవద్దని రష్మీ తెలిపింది.

జనాల కోసమే
జబర్దస్త్ లో నేను సుధీర్ ఒకరిపై ఒకరం పంచ్ లు వేసుకుంటాం. మా హద్దులు మాకు తెలుసు. తామిద్దరం అలా చేసేది జనాల వినోదం కోసమే అని రష్మీ తెలిపింది. మాఇద్దరి రిలేషన్ షిప్ ప్రొఫెషన్ పరంగా మాత్రమే అని తెలిపింది.

సుధీర్ ప్రపోజ్ చేస్తే
ఒక వేళ సుధీర్ నిజంగా ప్రపోజ్ చేస్తే అంగీకరించనని రష్మీ తెలిపింది. గుంటూరు టాకీస్ తరువాత మరోమారు బోల్డ్ లుక్ లో అంతకు మించి చిత్రంలో రష్మీ కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











