For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాం... యాంకర్ రష్మి ఓటు రచ్చ, చివరకు ఏమైందంటే?

  |

  యాంకర్ రష్మి తన ఓటు మిస్సయిందంటూ సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయింది. తనకు మాత్రమే కాదు.. మా చుట్టుపక్కల వారికి చాలా మందికి ఇలా జరిగింది అంటూ ఆమె పేర్కొన్నారు. ఈ ఇష్యూపై రష్మికి, అభిమానులకు మధ్య ఆసక్తికర చర్చ సాగింది.

  ఓటు వేయడానికి వైజాగ్ వచ్చాను. నాకు, మా అమ్మకు ఎలాంటి ఓటరు స్లిప్స్ అందలేదు. మాకు మాత్రమే కాదు.. మేము ఉంటున్న బిల్డింగులో ఎవరికి ఓటరు స్లిప్స్ అందలేదు. అంతా కలసి ఈ విషయంలో అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యామని తెలిపారు.

  మాకు స్లిప్స్ అందలేదు

  మాకు స్లిప్స్ అందలేదు

  నేను, మా అమ్మ ఓటు వేయడం ఇదే తొలిసారి కాదు. మాది వైజాగ్ పర్మినెంట్ అడ్రస్ కాబట్టి ప్రతి సారి ఇక్కడికి వచ్చి ఓటు వేస్తుంటాము. ఎలక్షన్ కమీషన్ వెబ్ సైట్లో చెక్ చేసుకుందామంటే అది ఓపెన్ కావడం లేదని రష్మి వాపోయారు.

  రష్మికి కౌంటర్ ఇచ్చిన నెటిజన్

  రష్మికి కౌంటర్ ఇచ్చిన నెటిజన్

  అయితే కొందరు రష్మి కామెంట్లపై స్పందిస్తూ.. మీ లాంటి వారు ఎందుకు చివరి నిమిషం వరకు మీ ఓటు గురించి పట్టించుకోరు. నెల రోజుల ముందే మీరు చెక్ చేసుకుని ఉండాలి అంటూ కామెంట్ చేశారు. దీనికి రష్మి ఘాటుగా సమాధానం ఇచ్చారు.

  మేము చచ్చిపోలేదుగా అంటూ రష్మి

  మేము చచ్చిపోలేదుగా అంటూ రష్మి

  నేను, మా అమ్మ లాంటి వారు, ఇంకా చాలా మంది తొలి సారి ఓటు వేస్తున్నవారు కాదుకదా... మేము మా అడ్రస్ కూడా మార్చలేదు.. రెగ్యులర్ గా టాక్స్ కడుతున్నాం కాబట్టి చనిపోయారు అని భావించడానికి కూడా లేదు. ఎప్పటి లాగే మా పేరు లిస్టులో ఉంటుందని అనుకున్నామని రష్మి తెలిపారు.

  ఎవరికి ఓటు వేస్తారంటే..

  ఎవరికి ఓటు వేస్తారంటే..

  ఓటు ఎవరికి వేస్తారు అని ఒక అభిమాని అడగా... ఓటు అనేది రహస్య పద్దతి ద్వారా నాయకుడిని ఎన్నుకునే విధానం. ఓటు ఎవరికి వేస్తాము అనేది చెప్పడం కరెక్ట్ కాదు అని ఈ సందర్భంగా రష్మి చెప్పుకొచ్చారు.

  ఆ విషయం ప్రచారం చేస్తున్న వారినే అడగండి

  ఆ విషయం ప్రచారం చేస్తున్న వారినే అడగండి

  మీరేమో ఇలా అంటున్నారు.. మీ తోటి ఆర్టిస్టులు కొందరు ఆయా పార్టీల తరుపున వకాల్తా పుచ్చుకుని వారికే ఓటు వేయండని అడుగుతున్నారు, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని మరొక అభిమాని ప్రశ్నించగా.... ఆ విషయం వారినే అడిగండి, నేను వారితో కలిసి లేనప్పుడు నన్ను ఈ ప్రశ్న అడగటం భావ్యం కాదు అని రష్మి తెలిపారు.

  చివరకు రష్మి ఓటర్ స్లిప్ దొరికింది

  చివరకు రష్మి ఓటర్ స్లిప్ దొరికింది

  అయిత కొంత సేపటి తర్వాత రష్మి తన ఓటర్ స్లిప్ దొరికిందని పేర్కొనడం గమనార్హం. అయితే తన తల్లి స్లిప్ ఇంకా అందలేదని ఆమె వెల్లడించారు. ఓటు గురించి ఈ చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

  English summary
  "Me and my mother have still not received our voters sheet and what came into light yesterday was that an entire building was not on voters sheet until they threaten the authorities that they wud raise a complaint. I’m not a first time voter and my voters id and permanent address has always been Vizag so me being on any other list is imp I’m gona wait till today evening. fyi people like me and my mum and many like us are not 1st time voters and nor hav we changed our address and nor are we dead so by default we r suppsoed to be on this list and also many like me are tax payers. I got mine but not my moms yet." Rashmi tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more