యాంకర్ రవి చేసిన పనికి అంతా ఫిదా.. గ్రేట్ ఫాదర్ అంటూ నెటిజన్ల కామెంట్స్
యాంకర్ రవి తన ఫ్యామిలీకి ఎంత ప్రాముఖ్యతను ఇస్తాడో అందరికీ తెలిసిందే. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా తన భార్య, పిల్లలతో సమయాన్ని గడుపుతుంటాడు. ఒకానొక సందర్బంలో యాంకర్ రవి పెళ్లి విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. అసలు రవికి పెళ్లి అయిందా? లేదా? అనే డిబేట్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. కానీ వాటన్నంటినికి రవి ఒకే ఒక్క ఫోటోతో చెక్ పెట్టేశాడు.

ఆ ఫోటో అంతా బట్టబయలు..
యాంకర్‌గా బుల్లితెరపై రవి పీక్స్ స్టేజ్‌లో ఉన్న సమయంలో తన పెళ్లి పెద్ద వివాదంగా మారింది. రవికి పెళ్లి అయిపోయింది.. ఓ పాప కూడా ఉందనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ రవి ఎప్పుడూ కూడా వాటిపై స్పందించలేదు. కానీ రవి ఎక్కడికి వెళ్లినా కూడా అవే ప్రశ్నలు ఎదురవ్వడం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా పెరగడంతో తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసి అందరి నోర్మూయించాడు.

ప్రేమ కథ కూడా..
రవి తన ప్రేమ కథను కూడా ఎన్నో సందర్భాల్లో బయటపెట్టేశాడు. తన ఫ్రెండ్ చూసుకున్న అమ్మాయిని ప్రేమించానని, అలా నిత్యను వివాహామాడానని క్రేజీ లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. బీటెక్‌లో తన ప్రేమ కథ అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక తన గారాల పట్టి వియా గురించి రవి ప్రతీసారి ఎమోషనల్ అవుతూనే ఉంటాడు.

వియాతో అలా..
రవి తన పాప వియాతోనే ఎక్కువగా సమయం గడుపుతుంటాడు. అంతేకాకుండా ఆ మధ్య బుల్లితెరపై ఓ ఈవెంట్‌లో తన పాపతో కలిసి చేసిన ఎమోషనల్ పర్ఫామెన్స్ అందరినీ కట్టిపడేసింది. ఇక లాక్డౌన్‌లో వియాతో రవి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇంట్లోనే ఉండటంతో కూతురితో ఆటలు ఆడుకుంటూ బాగానే ఎంజాయ్ చేశాడు.
Recommended Video

తాజాగా ఇలా..
అయితే తాజాగా రవి ఓ వీడియోను షేర్ చేశాడు. తన కూతురు కోరిందని వంటవాడిలా మారిపోయాడు రవి. కూతురి కోరికను తీర్చేందుకు వంటవండేశాడు. కూతురికి ప్రేమగా తినిపించాడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్రేట్ ఫాదర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











