twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంతో మంది లైఫ్ నాశనమైంది, నాకు మరో బ్రతుకు దెరువు లేదు: యాంకర్ రవి

    By Bojja Kumar
    |

    Recommended Video

    నాకు మరో బ్రతుకు దెరువు లేదు !

    ఇప్పటి వరకు ఇండస్ట్రీలో యాంకర్‌గా, ప్రోగ్రామ్ హోస్ట్ గా రాణించిన యాంకర్ రవి 'ఇది మా ప్రేమకథ' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి సినిమా ఇండస్ట్రీ వైపు తన జర్నీ ఎలా సాగిందో వెల్లడిచారు.

    వారిని చూసి ఇన్‌స్పైర్ అయ్యాను

    వారిని చూసి ఇన్‌స్పైర్ అయ్యాను

    నాకు ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేదని, చిన్నప్పటి నుండి చిరంజీవి, రజనీకాంత్, నాగార్జున లాంటి హీరోల సినిమాలు చూస్తూ పెరిగానని, వారిలాగా అవ్వాలని ఉండేది. డైరెక్టుగా సినిమాల్లోకి వచ్చే పరిస్థితి లేదుకాబట్టి ముందుగా యాంకరింగ్ మొదలు పెట్టినట్లు రవి తెలిపారు.

    చిన్న సినిమాల్లో హీరోనా? పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టా?

    చిన్న సినిమాల్లో హీరోనా? పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టా?

    నాలుగైదు సంవత్సరాలు యాంకరింగ్ చేసిన తర్వాత సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అపుడు పెద్ద సినిమాల్లో తమ్ముడు క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లాంటివి వచ్చేవి. అయితే అపుడు నాకు ఒక ఆలోచన మొదలైంది. పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెళ్లాలా? చిన్న సినిమాల్లో హీరోగానా? అనే అయోమయం ఉండేదని తెలిపారు.

    హీరోగా చేయాలనే డిసైడ్ అయ్యాను

    హీరోగా చేయాలనే డిసైడ్ అయ్యాను

    అయితే మన ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెళితే.... ఒకే రకమైన పాత్రలు ఇస్తారు. మనం మొదటి సినిమాలో హీరో తమ్ముడి పాత్ర లేదా హీరో ఫ్రెండ్ పాత్ర చేస్తే అలాంటి పాత్రలే మళ్లీ మళ్లీ వస్తుంటాయి. అలా ఒకే ఇమేజ్ లో ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే చిన్న సినిమాల్లో హీరోగా చేయాలని డిసైడ్ అయ్యాను అని రవి తెలిపారు.

    చాలా మంది లైఫ్ స్పాయిల్ అయింది

    చాలా మంది లైఫ్ స్పాయిల్ అయింది

    ఇండస్ట్రీకి హీరోగా వచ్చిన వాళ్లలో నా కళ్ల ఎదురుగా చాలా మంది లైఫ్ స్పాయిల్ అయింది. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాక కూడా వివిధ కారణాలతో చాలా మంది తమ కెరీర్ నాశనం చేసుకున్నారు. ఇండస్ట్రీ మీద అవగాహన లేకనో, బ్యాడ్ స్టోరీ సెలక్షన్ వల్లనో ఇలా జరిగింది. అలాంటివి దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నాను అని రవి తెలిపారు.

    ఒకరు చెబితే వినను

    ఒకరు చెబితే వినను

    నాపై నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. నేను ఒకరి చెబితే వినను. నాకు నచ్చిందే చేస్తాను. తప్పు చేస్తున్నాను అని అనిపిస్తే మానేస్తాను. కొన్ని సార్లు మనకు తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతుంటాయి. వాటి నుండి కొత్త విషయాలు నేర్చుకుని ముందుకు సాగుతుంటాను అని రవి తెలిపారు.

    ఇది తప్ప మరో బ్రతుకుదెరువు లేదు

    ఇది తప్ప మరో బ్రతుకుదెరువు లేదు

    నేను యాంకరింగ్ చేసుకుంటూ దాంట్లో యాక్టింగ్ చేస్తాను. ఇది తప్ప నాకు వేరే బ్రతుకు దెరువు లేదు. నేను సాఫ్ట్ వేర్ జాబో, కార్పెంటర్ జాబో, మరేదో వ్యాపారం చేయడం నాకు చేతకాదు. చచ్చినా బ్రతికినా, ఎవరైనా తిట్టినా పొగిడినా నాకు వచ్చింది ఇది ఒక్కటే అని యాంకర్ రవి తెలిపారు.

    English summary
    Anchor Ravi Gets Emotional about his Profession in Idi Maa Prema Katha Movie Latest Interview. I do not know how to do another job except films and tv shows.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X