twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇల్లు తాకట్టు పెట్టాం, చాలా కష్టపడుతున్నాం, నా పెళ్లి గురించి అనవసరం: యాంకర్ రవి

    By Bojja Kumar
    |

    యాంకర్ రవి హీరోగా 'ఇది నా ప్రేమ కథ' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ విడుదలై చాలా కాలమైనా.... సినిమా రిలీజ్ ఇంకా కాలేదు. దీనిపై పలువురు ఫ్యాన్స్ ను సోషల్ మీడియా ద్వారా యాంకర్ రవిని ప్రశ్నిస్తుండటంతో వివరణ ఇచ్చారు.

    Recommended Video

    ఆ ఘటనతో ఇండస్ట్రీ వదిలేద్దామనుకొన్నా -యాంకర్ రవి

    'ఇది మా ప్రేమ కథ' సినిమా ఎప్పుడు రిలీజ్ అని సోషల్ మీడియాలో అడుగుతున్నారు. క్రీస్తు పూర్వం టీజర్ రిలీజ్ చేశాం. దాని తర్వాత మహాత్మా గాంధీ గారు ఉన్నపుడు పాటలు రిలీజ్ చేశాం. సినిమా రాదా? రిలీజ్ చేయరా? అంటున్నారు.... దానికి కారణాలే ఇవే అంటూ రవి వివరించారు.

     సినిమా తీయడం ఈజీ, రిలీజ్ చేయడమే కష్టం

    సినిమా తీయడం ఈజీ, రిలీజ్ చేయడమే కష్టం

    ముందు మేము సినిమా తీయడం చాలా కష్టం అనుకున్నాం. కానీ సినిమా తీయడం కంటే రిలీజ్ చేయడం కష్టం అని ఇప్పుడు తెలుస్తోంది. సినిమా రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాం. మాది చిన్న సినిమా కావడంతో రిలీజ్ చాలా ఇబ్బందిగా ఉంది అని రవి తెలిపారు.

     చాలా కాంపిటీషన్ ఉంది

    చాలా కాంపిటీషన్ ఉంది

    సంవత్సరంలో 200 తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. దీంతో పాటు 100 డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. మొత్తం 300 వరకు సినిమాలు వస్తున్నాయి. సంవత్సరంలో 52 శుక్రవారాలు ఉంటాయి. ప్రతి వారం 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మన ఇండస్ట్రీలో 10 మంది పెద్ద హీరోలు ఉన్నారు. ఆ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిందంటే వేరే ఏ సినిమాలు రిలీజ్ కావు. ఎందుకంటే కాంపిటీషన్.... అని యాంకర్ రవి తెలిపారు.

     పెద్ద హీరోలకు 10 వారాలు

    పెద్ద హీరోలకు 10 వారాలు

    పెద్ద హీరోల కోసం ఓ 10 వారాలు తీసేసినా ఇంకా 40 వారాలు ఉంటాయి. 40 శుక్రవారాల్లో 300 సినిమాలు రిలీజ్ అవ్వాలి. ఒక్కొక్క వారం ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఎన్ని సినిమాలు తెలియకుండానే వెళ్లిపోతున్నాయో మీరు అర్థం చేసుకోవాలి... అని రవి తెలిపారు.

     అలా చేస్తే చాలా నష్టపోతాం.

    అలా చేస్తే చాలా నష్టపోతాం.

    ప్రతి సినిమాకు డబ్బులు కావాలి. మా సినిమా కోసం ఎక్స్‌వైజెడ్ అని కొంత అమౌంట్ పెట్టాం. ప్రమోషన్ కోసం కొంత ఖర్చు చేశాం. ఈ మొత్తం రికవరీ కావాలంటే.... ఒక ఎక్స్ వైజడ్ నెంబరాఫ్ థియేటర్లలలో సినిమా రిలీజ్ కావాలి. తక్కువ థియేటర్లలో రిలీజ్ అయితే సినిమాకు అనుకున్న డబ్బులు రావు. అలా చేస్తే చాలా నష్టపోతాం.

     అప్పు చేసి, ల్యాండ్ అమ్ముకుని

    అప్పు చేసి, ల్యాండ్ అమ్ముకుని

    అప్పు చేసి, ఉన్న ల్యాండ్ అమ్ముకుని, ఇంటి పేపర్లు తాకట్టు పెట్టి సినిమా మీద పాషన్ తో చేశాం. నెంబరాఫ్ థియేటర్లు దొరకాలనే ఉద్దేశ్యంతోనే సినిమా డిలే అవుతోంది. రిలీజ్ చేయడానికి మంచి బేనర్ దొరకాలి. సినిమా ఆడేది ఒక ఆరు రోజులే. ఆ ఆరు రోజులు సినిమా బ్రతకాలి. ఆ ఆరు రోజులు మీ ఇంటి దగ్గర్ ఉన్న థియేటర్లలో పడాలి. అప్పుడు మేము అనుకున్నది సాధిస్తాం. ఒక యాక్టర్ గా నన్ను అందరూ చూడాలి, నిర్మాతకు అనుకున్న డబ్బులు రావాలి..... ఆ ప్రయత్నంలోనే సినిమా రిలీజ్ లేట్ అవుతోంది అని యాంకర్ రవి తెలిపారు.

     నా పెళ్లి గురించి అనవసరం

    నా పెళ్లి గురించి అనవసరం

    సెన్షేషన్ క్రియేట్ చేస్తేనే గుర్తింపు వస్తుందని యాంకర్ రవి తెలిపాడు. తను హీరోగా అరంగేట్రం చేస్తున్న 'ఇది మా ప్రేమ కథ' సినిమా ప్రమోషన్ సందర్భంగా మాట్లాడుతూ, సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తుంటాయని అన్నాడు. తనకు పెళ్లయిందా? లేదా? అన్నది తన పర్సనల్ అంశమని, దానిని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు.

    శ్రీముఖి నేనేమన్నా పట్టించుకోదు

    శ్రీముఖి నేనేమన్నా పట్టించుకోదు

    సినిమాల్లోకి వచ్చిన తరువాత తన గురించి చెప్పాలనిపించిందని, అయితే టాపిక్ డైవర్ట్ అవుతుందని చెప్పలేదని, లాస్యతో తనకు కంఫర్ట్ జోన్ ఉండేదని, ఇప్పుడు శ్రీముఖితో కూడా కంఫర్ట్ జోన్ ఉందని, అయితే శ్రీముఖితో అది కొంచెం ఎక్కువని తెలిపాడు. శ్రీముఖిని తానేదైనా అంటే పట్టించుకోదని, అలాంటప్పుడు ఇతరులు ఏమన్నా పట్టించుకోవాల్సి అవసరం లేదన్నారు.

    English summary
    Anchor Ravi about Idhi Maa Prema Katha release delay. The film will be postponed due to the lack of sufficient number of theaters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X