twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాస్యకు ఏమీ తెలియదు, అన్నీ నేర్పించా, అలాంటి నాపైనే అలా.... : యాంకర్ రవి

    By Bojja Kumar
    |

    Recommended Video

    లాస్యకు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టడం కూడా రాదు !

    ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నా యాంకర్ రవి మీదనే ఎందుకు ఇన్ని వివాదాలు... అనే ప్రశ్నకు యాంకర్ రవి సమాధానం ఇచ్చారు. నేను ఎప్పుడూ ఇమేజ్ గురించి ఆలోచించలేదు. నా ఇమేజ్ ఇలా ఉండాలని, నా గురించి ప్రజలు మంచి మాత్రమే మాట్లాడుకోవాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రతి మనిషిలోనూ నెగెటివ్, పాజిటివ్ రెండూ ఉంటాయి. కానీ జనాలు దాన్ని ఒప్పుకోరు. నాపై ఇలాంటి వివాదాలు రావడానికి అది కూడా కారణం అయి ఉండొచ్చని రవి తెలిపారు.

    అమ్మాయిలు కంఫర్ట్‌గా ఉంటేనే వారితో క్లోజ్‌గా మూవ్ అవుతా

    అమ్మాయిలు కంఫర్ట్‌గా ఉంటేనే వారితో క్లోజ్‌గా మూవ్ అవుతా

    నేను అన్ని విషయాల్లోనూ ఓపెన్ గా ఉంటాను. నాతో ఎవరైనా అమ్మాయి కంఫర్టబుల్ గా ఉంటేనే వాళ్లను పట్టుకోవడం, నాకు దగ్గరగా లాక్కోవడం, వారితో డాన్స్ చేయడం లాంటివి చేస్తాను అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రవి తెలిపారు.

    అంత ఓవర్‌గా అయితే చేయను

    అంత ఓవర్‌గా అయితే చేయను

    నా ప్రవర్తన కంప్లైయింట్ చేసేంత ఓవర్ గా మాత్రం ఉండదు. నేను చేసేది ఎవరైనా అమ్మాయికి నచ్చట్లేదు అని తెలిస్తే వెంటనే ఆపేస్తాను. వాళ్లు ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నపుడే అలా చేస్తాను. నేను పటాస్‌లో ఎలా ఉంటానో బయట కూడా అలాగే ఉంటాను.... అని రవి తెలిపారు.

    లాస్యకు ఇండస్ట్రీ గురించి తెలియదు

    లాస్యకు ఇండస్ట్రీ గురించి తెలియదు

    లాస్యతో కాంట్రవర్సీ ఏమీ లేదు. మా ఇద్దరి పెయిర్ తెరపై బావుందని చాలా మంది ప్రశంసించారు. ఆమెకు అసలు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. యాంకర్ అవ్వాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు రావడం మొదలైన తర్వాత నేను దగ్గరుండి అన్ని చెప్పాను.... అని రవి తెలిపారు.

    నెగెటివ్ కామెంట్స్ వస్తే భయపడింది

    నెగెటివ్ కామెంట్స్ వస్తే భయపడింది

    లాస్యకు ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టడం కూడా రాదు. నెగెటివ్ కామెంట్స్ వస్తే అమ్మో నాకు ఫేస్ బుక్ వద్దు అన్న సందర్భాలు ఉన్నాయి. ఇండస్ట్రీ అంటే ఇలానే ఉంటుంది అని నచ్చజెప్పాను. నువ్వు సెలబ్రిటీ అయినపుడు పాజిటివ్ గా పొగిడినపుడు తీసుకోవాలి, నెగెటివ్‌గా తిట్టినపుడు కూడా తీసుకోవాలి అని చెప్పాను అని రవి తెలిపారు.

    ఆమె ఆలోచనలో పడిపోయింది

    ఆమె ఆలోచనలో పడిపోయింది

    అంత దగ్గరుండి అన్ని చేసినపుడు ఒక సందర్భంలో ఎక్స్ వై జడ్ రీజన్స్ వల్ల నేను, మరో యాంకర్ కలిసి షోలు చేయడం జరిగింది. చాలా గ్రేట్ గా ఆ షోస్ చేశాం. లాస్యకు అవకాశాలు తగ్గడంతో కేవలం రవి ఉంటేనే నాకు షోలు వస్తున్నాయి, ఇక యాంకరింగ్ చేయను అని ఆలోచనలో పడిపోయింది. నా గురించి ఇంటర్వ్యూలో ఏదేదో మాట్లాడింది.... రవి చెప్పుకొచ్చారు.

    వాస్తవానికి జరిగింది వేరు

    వాస్తవానికి జరిగింది వేరు

    నువ్వు సక్సెస్ లో ఉన్నపుడు ఏం మాట్లాడతావో కాదు, నువ్వు డౌన్ లో ఉన్నపుడు ఏం మాట్లాడతావు అనేదే నీ క్యారెక్టర్ ఏమిటో తెలియజేస్తుంది. నాకు, తనకు మధ్యలో నాకు తెలిసిన ఒక స్టోరీ, తనకు తెలిసిన ఒక స్టోరీ, వాస్తవానికి జరిగింది ఒక స్టోరీ మూడు స్టోరీస్ ఉన్నాయి.... అని రవి తెలిపారు.

    ఆమె ఎప్పుడూ బావుండాలని కోరుంటాను

    ఆమె ఎప్పుడూ బావుండాలని కోరుంటాను

    మీరు తను చెప్పిన స్టోరీ విన్నారు. నేను దానికి రియాక్ట్ అవ్వడం లేదు. దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. జరిగిన స్టోరీ నాకు తెలియనపుడు ఎందుకు రియాక్ట్ అవ్వడం? నా పని నాకు ఉంది. ఆమె(లాస్య) ఎప్పుడూ బావుండాలని కోరుంటాను అని రవి తెలిపారు.

    English summary
    Telugu Anchor Ravi said some interesting details about Lasya's Controversy in his latest interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X