twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ రవి కాళ్లు పట్టుకున్న సుమ.. ఏంటి పిచ్చా అంటూ కౌంటర్!

    |

    బుల్లితెరపై కొన్ని షోలు, కొంత మంది యాంకర్లు వేసే ముద్ర అంతా ఇంతా కాదు. ఎన్నేళ్లు అయినా కూడా అది ఓ బ్రాండ్‌లా మారిపోతుంది. అలా బుల్లితెరపై సుమ, ఓంకార్, ఉదయభాను వంటి వారెంతో మంది తమకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. ఈ అందరిలోనూ ఓంకార్ యాంకరింగ్, హోస్టింగ్ చేసే విధానం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఓంకార్ యాంకరింగ్‌ను ఎన్నో రకాలుగా ఎన్నో సినిమాల్లో వాడేశారు.

    నిక్కీ తంబోలి న్యూ స్టైలిష్ ఫొటోస్ వైరల్

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    యాంకర్ సుమ, రవిలు కలిసి జీ తెలుగులో బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అనే షోను చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ప్రతీ వారం కొందరు సెలెబ్రిటీలను పట్టుకుని రావడం, వారి ముందు వింత వింత ప్రదర్శనలు ఇప్పిస్తూ వారిని ఎంటర్టైన్ చేస్తుంటుంది సుమ. తాజాగా సుమ, రవి కలిసి అందరినీ ఎంటర్టైన్ చేశారు.

    గెస్ట్‌గా ఏ1 ఎక్స్ ప్రెస్..

    గెస్ట్‌గా ఏ1 ఎక్స్ ప్రెస్..

    ప్రస్తుతం సందీప్ కిషన్ లావణ్య త్రిపాఠిలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమాకు మంచి టాక్ రావడంతో సినిమా దూసుకుపోతోంది. కలెక్షన్లు మరీ అంత గొప్పగా లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సినిమా మాత్రం నిలకడగానే దూసుకుపోతోంది. ఇంకా ప్రమోట్ చేసుకునేందుకు బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో గెస్ట్‌గా వచ్చింది టీం.

    లావణ్య, సుమ డ్యాన్సులు..

    లావణ్య, సుమ డ్యాన్సులు..

    ఏ1 ఎక్స్ ప్రెస్ టీం బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. ఇక కజరారే సాంగ్‌కు లావణ్య త్రిపాఠి, సుమలు చేసిన డ్యాన్స్, వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఇక వాటిపై యాంకర్ రవి చేసిన సెటైర్లు మరింతగా వైరల్ అయ్యాయి.

    ఓంకార్ స్టైల్లో..

    ఓంకార్ స్టైల్లో..

    అలా సుమ, లావణ్య ఇద్దరూ కూడా డ్యాన్స్ చేయడంతో.. రవి ఎంట్రీ ఇచ్చి ఓంకార్ స్టైల్లో యాంకరింగ్ చేశాడు. ఎలా అనిపించింది మాస్టర్ అంటూ ఓంకార్‌లా మిమిక్రీ చేశాడు రవి. ఆ వెంటనే సుమ వచ్చి రవి కాళ్లకు మొక్కింది. ఆ తరువాత రవి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    ఏంటి పిచ్చా?

    ఏంటి పిచ్చా?

    సుమ అలా కాళ్లకు మొక్కడంతోనే రవి కౌంటర్ వేశాడు. ఏంటి పిచ్చా? పిచ్చి పిచ్చిగా ఉందా మీకు అని రవి కౌంటర్ వేయడంతో సుమ షాక్ అయింది. మొత్తానికి ఏ1 ఎక్స్ ప్రెస్ టీంతో సుమ, రవి చేసిన సందడి బాగానే క్లిక్ అయ్యేలా కనిపిస్తోంది.

    English summary
    Uppena team In Suma Big Celebrity challenge..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X