For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాట్సప్ చాట్ బయటపెట్టేసిన వర్షిణి.. తలపట్టుకున్న యాంకర్ రవి

    |

    యాంకర్ రవి, వర్షిణి బుల్లితెరపై ఎంతటి స్టార్డంతో దూసుకుపోతోన్నారో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై రవి ఎంతో సీనియర్ అయినప్పటికీ వర్షిణితో క్లోజ్‌గానే ఉంటాడు. ఈ ఇద్దరూ కలిసి చేసిన పటాస్ షో బాగానే క్లిక్ అయింది. అక్కడ మొదలైన స్నేహం నేటికీ కొనసాగుతూనే ఉంది. వృత్తిపరంగానే కాకుండా ఈ ఇద్దరూ వ్యక్తిగతంగానూ ఎంతో సన్నిహితంగా ఉంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఇరువురు ఎంతో క్లోజ్‌గా ఉంటారు.

    ప్రెగ్నెన్సీతోనే కరీనా కపూర్ కసరత్తులు.. యోగాతో కడుపులో బిడ్డకు..

    అక్కడే మొదలైంది..

    అక్కడే మొదలైంది..

    పటాస్ షోను శ్రీముఖి రవి కలిసి బాగానే నిర్వహించారు. ఈ షో మంచి పీక్స్‌లో ఉండగానే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి వెళ్లింది. అలా శ్రీముఖి వెళ్లడంతో ఆ ప్లేస్‌లోకి వర్షిణి ఎంట్రీ ఇచ్చింది. అలా వర్షిణి వచ్చాక షో మరింత క్లిక్ అయింది. వర్షిణి రవి కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.

    బయట కూడా అంతే..

    బయట కూడా అంతే..

    తెరపై వీరు ఎంత సరదాగా ఉంటారో తెర వెనుకా అంతే రచ్చ చేస్తుంటారు. షోలో కాకుండా బయట కూడా వీరు సందడి చేస్తుంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా వారంతా కలిసి సందడి చేస్తుంటారు. రవి ఫ్యామిలీతో వర్షిణి.. వర్షిణి కుటుంబంతో రవి ఎంతో క్లోజ్‌గా ఉంటారు.

    అందుకే అలా..

    అందుకే అలా..

    వర్షిణి రవి ఎంతో క్లోజ్‌గా ఉంటారు కాబట్టే..ఎప్పుడూ బయటకు రాని తన సోదరిని రవి కోసం ఇంటర్వ్యూలో కూర్చోబెట్టింది. దీపావళి సందర్బంగా రవి తన యూట్యూబ్ చానెల్‌లో వర్షిణిని ఆమె అక్కను కలిపి ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ, అందులో రవి వర్షిణి చేసిన సందడి బాగా వైరల్ అయింది.

    తాజాగా ఇలా..

    తాజాగా ఇలా..

    తాజాగా వర్షిణి చేసిన పనికి యాంకర్ రవి పరువుపోయింది. యాంకర్ రవి చేసిన వాట్సప్ చాట్‌ను వర్షిణి సోషల్ మీడియాలో పెట్టేసింది. ఏదో వాయిస్ మెసెజ్ పంపిన రవికి వర్షిణి ఓకే అని చెప్పింది. ఆ తరువాత రవి మరో సందేశాన్ని పంపాడు. హై హీల్స్ వేసుకోకు ప్లీజ్ అంటూ మరో మెసెజ్ పంపాడు.

    నీ యెంకమ్మ..

    నీ యెంకమ్మ..

    అలా రవి పెట్టిన మెసెజ్‌ను ఇన్ స్టాలో పెట్టేస్తా అని చెబుతూ.. పొట్టి వాళ్ల కష్టాలు అని చెప్పింది వర్షిణి. అలా కామెడీగా అంటోందని రవి అనుకున్నట్టున్నాడు. నిజంగానే అలా వాట్సప్ చాట్‌ను బయటపెట్టేయడంతో. నీ యెంకమ్మ నిజంగానే పెట్టావా? అని రవి తలపట్టుకున్నాడు. ఎంట్రీలో సాంగ్ చేయాల్సి వస్తుంది.. హై హీల్స్ అందుకే వేసుకోవద్దు అని చెప్పా.. కానీ నీకు అలా అర్థమైందా? అంటూ రవి రివర్స్ కౌంటర్ వేశాడు.

    English summary
    anchor ravi and varshini whatsapp chat Goes viral..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X