»   » ఇప్పటికైనా మారండి: శ్రీనివాస్ హత్యపై యాంకర్ రవి కామెంట్స్!

ఇప్పటికైనా మారండి: శ్రీనివాస్ హత్యపై యాంకర్ రవి కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారతీయుడు, తెలుగువాడైన కూచిబొట్ల శ్రీనివాస్ ఇటీవల అమెరికాలో జాత్యహంకారి కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై యాంకర్ రవి ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. రవి కామెంట్స్ మీద మిశ్రమ స్పందన వస్తోంది.

నిన్న శ్రీనివాస్ కు జరిగింది, రేపు కూడా జరుగదని గ్యారంటీ లేదు. ఇలాంటివి చూస్తూ కూడా స్టూడెంట్స్, పేరెంట్స్ ఎందుకు ఇంకా యూఎస్, యూకె, ఉన్నత చదువులంటూ పక్క దేశాల వైపు చూస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ... కూచిబొట్ల శ్రీనివా అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

మన దగ్గర అన్నీ ఉన్నాయి

మన దగ్గర అన్నీ ఉన్నాయి

మన దేశంలో మనము కూర్చుని కంప్లైన్ చేస్తున్నాం కానీ.. మీకు తెలివి ఉంటే.. ఇక్కడ అన్నీ ఉన్నాయని....పేరెంట్స్‌కి డబ్బు పంపడం కంటే వారితో కూర్చుని ఒక్క పూట తినడం నిజమైన సంతోషాన్నిస్తుందని యాంకర్ రవి ఫేస్‌‌బుక్‌లో పోస్ట్ చేశాడు. రవి స్పందనపై మిశ్రమ స్పందన వస్తోంది.

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న రవి

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న రవి

ఇప్పటి వరకు బుల్లితెరకే పరిమితం అయిన రవి త్వరలో వెండితెరపై అడుగు పెట్టబోతున్నాడు. యాంకర్ నుండి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చిలిపి యాంకర్ గా ఇప్పటి వరకు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రవి లవర్ బాయ్ గా వెండితెర ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్నాడు.

ఇది మా ప్రేమకథ

ఇది మా ప్రేమకథ

యాంకర్ రవి త్వరలో ‘ఇది మా ప్రేమ కథ' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 1>99 అనేది ట్యాగ్ లైన్. ఇందులో రవి ప్రేమికుడిగా కనిపించబోతున్నాడని, యూత్ మెచ్చే అంశాలతో ఈ లవ్ స్టోరీ ఉంటుందని టాక్.

గుట్టుచప్పుడు కాకుండా

గుట్టుచప్పుడు కాకుండా

యాంకర్ రవి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పెద్దగా పబ్లిసిటీ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేసారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది.

దర్శకుడు ఎవరు?

దర్శకుడు ఎవరు?

ఈ సినిమాకు అయోధ్య కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ కొండకండ్ల సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.

ఎప్పుడు రిలీజ్ చేస్తారు?

ఎప్పుడు రిలీజ్ చేస్తారు?

సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని... ఏప్రిల్ నెలలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

English summary
Anchor Ravi comments about Srinivas Kuchibhotla death. Kuchibhotla, 32, was shot dead on Wednesday by a US navy veteran in a bar in Kansas in a possible hate crime. Kuchibhotla’s colleague Alok Madasani, also an Indian, and an American citizen, who tried to stop the shooter, were injured in the incident.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu