TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
ఒక్కరోజులోనే పరిస్థితి తారుమారు, యాంకర్ రవికి షాక్..

యాంకర్ రవి హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం 'ఇది మా ప్రేమ కథ'. తగినన్ని థియేటర్లు దొరకని కారణంగా చాలా రోజులుగా విడుదలకు నోచుకోని ఈ చిత్రం రెండు రోజుల క్రితం విడుదల తేదీ (డిసెంబర్ 8) ఫిక్స్ అయింది.
సినిమా రిలీజ్ ఫిక్స్ అవ్వగానే యాంకర్ రవి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.... చాలా రోజుల తన కల నెరవేర బోతోంది అంటూ వెల్లడించారు. తన సినిమాను సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ బిజీ అయిపోయాడు. అయితే ఈ ఆనందం రవికి ఒక్కరోజు కూడా మిగల్లేదు.
ఒక్కరోజులోనే పరిస్థితి తారుమారు
అయితే ఏమైందో తెలియదు కానీ.... ఒక్కరోజులోనే పరిస్థితి తారుమారైంది. డిసెంబర్ 8న విడుదల చేయాలనుకున్న ఈచిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
అసలు కారణం ఏమిటి?
టెక్నికల్ ఇష్యూస్ కారణంగా విడుదల వాయిదా వేయడం జరిగిందని నిర్మాత చెబుతున్నప్పటికీ..... అసలు కారణం వేరే అని అంటున్నారు. ఈ వారం మరో నాలుగు తెలుగు చిన్న సినిమాలు విడుదలవుతుండటంతో థియేటర్ల కేటాయింపు విషయంలో నిర్మాత అసంతృప్తిగా ఉన్నారని, ఇపుడు విడుదల చేస్తే భారీగా నష్టపోవడం ఖాయమనే ఉద్దేశ్యంతో సినిమా విడుదల వాయిదా వేసినట్లు టాక్.
అప్పు చేసి, ఇల్లు తాకట్టుపెట్టి
సినిమా తీయడం కంటే, దాన్ని రిలీజ్ చేయడమే ఈ రోజుల్లో చాలా కష్టమైన పని అని యాంకర్ రవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అప్పు చేసి, ఉన్న ల్యాండ్ అమ్ముకుని, ఇంటి పేపర్లు తాకట్టు పెట్టి సినిమా మీద పాషన్ తో చేశాం. నెంబరాఫ్ థియేటర్లు దొరకాలనే ఉద్దేశ్యంతోనే సినిమా డిలే అవుతోంది. సినిమా ఆడేది ఒక ఆరు రోజులే. ఆ ఆరు రోజులు సినిమా బ్రతకాలి. ఆ ఆరు రోజులు మీ ఇంటి దగ్గర్ ఉన్న థియేటర్లలో పడాలి. అప్పుడు మేము అనుకున్నది సాధిస్తాం. ఒక యాక్టర్ గా నన్ను అందరూ చూడాలి, నిర్మాతకు అనుకున్న డబ్బులు రావాలి..... ఆ ప్రయత్నంలోనే సినిమా రిలీజ్ లేట్ అవుతోంది అని యాంకర్ రవి తెలిపారు. ఈ ఇంటర్వ్యూ జరిగిన రెండు రోజులకే సినిమా డిసెంబర్ 8న విడుదల చేస్తున్న ప్రకటన రావడం, మళ్లీ ఈ రోజు సినిమా వాయిదా వేస్తున్నట్లు నిర్మాత ప్రకటించడం అంతా చకచకా జరిగిపోయింది.
ఇది మా ప్రేమకథ
"ఇది మా ప్రేమ కథ" ద్వారా యాంకర్ రవి, సీరియల్ నటి మేఘన లోకేష్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మస్తున్నాయి. అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతుండగా, కార్తీక్ కొడకండ్ల సంగీత సారధ్యం వహించారు. ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్: రమేష్ కొత్తపల్లి, పాటలు: దినేష్ (నాని), సినిమాటోగ్రఫీ: మోహన్ రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, నిర్మాణం: మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె.క్రియేషన్స్, నిర్మాత: పి.ఎల్.కె.రెడ్డి, దర్శకత్వం: అయోధ్య కార్తీక్!