కొంచెం డిఫరెంట్.. ఏడేళ్ల తరువాత మళ్లీ ఆ పని.. యాంకర్ రవి రచ్చ
యాంకర్ రవి లైవ్ షోలో కనపడి ఎన్నో రోజులు అయింది. ఇప్పుడు వచ్చే షోలన్నీ కూడా ఎప్పుడో షూటింగ్ అయిపోతుంటాయి. ఎడిటింగ్ చేసి వాళ్లకి తగ్గట్టుగా వేసేసుకుంటారు. అది పండుగల సందర్భంలో వచ్చే స్పెషల్ ఈవెంట్లు అయినా సరే.. డెయిలీ వచ్చే షోలు అయినా సరే కానీ లైవ్ షో చేస్తే వచ్చే మజానే వేరు. ఎందుకంటే యాంకర్‌గా సమయస్ఫూర్తి అక్కడే కనిపిస్తుంది. లైవ్ షోలోనే యాంకర్ సత్తా బయటపడుతుంది.
Recommended Video

మొదట్లో అలానే..
యాంకర్‌గా రవి తన కెరీర్‌ను మొదలుపెట్టింది కూడా లైవ్ షో ద్వారానే. రవి లాస్య కలిసి మా మ్యూజిక్ చానెల్‌లో సంథింగ్ స్పెషల్ అనే షోను చేశారు. కాలర్లతో మాట్లాడుతూ వారితో పంచ్‌లు, సెటైర్లు వేస్తూ ఎంతో చాకచక్యంగా ఆ షోను నడిపించారు. మళ్లీ ఆ తరువాత లైవ్ షో చేయనేలేదు.

బిజీబిజీగా..
యాంకర్ రవి ఆ తరువాత ఫుల్ బిజీగా అయ్యాడు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా ఎదిగిపోయాడు. పలు రకాల కామెడీ షోలతో రెచ్చిపోయాడు. ఇప్పుడు క్షణం తీరిక లేని యాంకర్‌గా స్టార్డం తెచ్చుకున్నాడు. ఆ మధ్య హీరోగానూ రవి ట్రై చేశాడు.కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు.

అక్కడా ఇక్కడా..
యాంకర్ రవికి అక్కడా ఇక్కడా అనే తేడానే లేదు. స్టార్ మాలో కనిపిస్తాడు.. జీ తెలుగులో షోలు చేస్తుంటాడు.. ఈటీవీలోనూ సందడిచేస్తుంటాడు. ప్రస్తుతమైతే ఈటీవీలో నువ్వు రెడీ నేను రెడీ, స్టార్ మాలో సంక్రాంతి ఈవెంట్.. జీ తెలుగులో బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ వంటి వాటితో బిజీగా ఉన్నాడు.

కొత్త షో..
తాజాగా రవి తన కొత్త షోకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ఈ సారి కొంచెం డిఫరెంట్.. కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా... ఏడేళ్ల తరువాత మళ్లీ లైవ్ ప్రోగాం చేస్తున్నా.. ఈ సారి మాత్రం నాలెడ్జ్ పంచడానికి వస్తున్నా.. సమాధానాలు చెప్పండి.. బహుమతులు గెలవండి అంటూ కొత్త షోకు సంబంధించిన వివరాలను చెప్పాడు.


Click it and Unblock the Notifications











