పేదలకు దుప్పట్లు పంచిన ఐమాక్స్ మెక్ డొనాల్డ్స్, యాంకర్ రవి
"రోనాల్డ్ హోమ్ మెక్ డోనాల్డ్ చారిటీ" వాళ్ళు గత మూడేళ్లుగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడు ప్రసాద్స్ ఐమాక్స్‌లోని మెక్‌డోనాల్డ్ ఎంప్లాయిస్ తమ తమ జీతం లోంచి కాస్త డబ్బు పోగుచేసి సుమారు రూ.25 వేల ఖర్చు చేసి 300 దుప్పట్లు కొనుగోలు చేసి రోడ్లపై ఉండే అనాధలకు ,పేదలకు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో "ఇది మా ప్రేమ కథ" హీరో యాంకర్ రవి ,హీరోయిన్ కుమారి మేఘన లోకేష్ తో రాత్రి 11 గంటలకు బసవతారకం కాన్సర్ హాస్పిటల్ దగ్గర పంచి పెట్టారు.
Recommended Video


ఈ సందర్భంగా హీరో రవి మాట్లాడుతూ.. పేదలకు సహాయం చేయటం చాలా మంచి కారిక్రమం రోనాల్డ్ హోమ్ మెక్ డోనాల్డ్ చారిటీ వాళ్ళు చేస్తున్న గత మూడేళ్ళుగా ఇంత మంచి పని చేస్తున్న ఈసారి మాత్రం మీడియా ద్వారా వీళ్ళు చేస్తున్న పని చూసి ఇంకా చాలా మంది ముందుకు వస్తారని ఆశిస్తున్నాము అన్నారు.

హీరోయిన్ మేఘన లోకేష్ మాట్లాడుతూ.. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా ద్వారా కూడా ఏదోఒక సహాయం పేదలకు తప్పకుండా చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో మెక్ డొనాల్డ్స్ మేనేజర్ సుశీల్‌తోపాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు .


Click it and Unblock the Notifications











