Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాకు దానికి సంబంధం లేదు అంటున్న యాంకర్ రవి
గత రెండు రోజులుగా యాంకర్ రవి అనే ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కొన్ని మీడియా చానల్స్ మీద అసభ్య వ్యాఖ్యానాలు చేశాడంటూ కథనాలు వినబడుతున్నాయి. అయితే.. ఆ ట్విట్టర్ ఎకౌంట్ కీ తనకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు యాంకర్ రవి.
రవి మాట్లాడుతూ.. "నా సోషల్ మీడియా ఎకౌంట్స్ అన్నిట్నీ వ్యాక్డ్ అవుట్ మీడియా మెయింటైన్ చేస్తుంది. గత కొన్నేళ్లుగా నేను ట్విట్టర్ లో యాక్టివ్ గా లేను. కేవలం ఫేస్ బుక్ మాత్రమే వాడుతున్నాను. అయినా.. నా పేరుతో ఎవరో తెలియనివారు ట్విట్టర్ ఎకౌంట్ యూజ్ చేస్తూ నా పేరు మీద అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నారు. వారిపై నేను లీగల్ గా కేస్ వేసి ప్రొసీడ్ అవుతాను. మీడియా మిత్రులు ఎవరూ సదరు ట్వీట్స్ గురించి కన్ఫ్యూజ్ అవ్వొద్దని నా మనవి" అని వివరించాడు.
సోషల్ మీడియాలో ఎవ్వరి అనుమతి లేకుండా కొందరి అకౌంట్స్ వాడుతుంటారు. వారి ప్రమేయం లేకుండా అనవసర సమాచారం అందిస్తున్న వారిపై యాంకర్ రవి మండి పడ్డాడు. ఈ విషయం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.