బుద్దున్నోడు ఎవరైనా అంటూ...లైవ్ లోనే శ్రీముఖిపై యాంకర్ రవి దారుణమైన కామెంట్

By Srikanya

హైదరాబాద్ : తనదైన స్టైల్‌లో కామెడిని పండిస్తూ.. బుల్లితేరలో దూసుకెళ్తున్నాడు యాంకర్‌ రవి. ముఖ్యంగా పటాస్ ప్రోగ్రాంతో మరింత పాపులరయ్యాడు. ఇక ఈ షోలో రవికి జోడిగా శ్రీముఖి చేస్తుంది. ఇప్పుడు వీరిద్దరి రిలేషన్‌ షిప్‌పై సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

ఈ ఇద్దరు తమ యాంకరింగ్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకోవడమే కాదు... వారి ఓవర్ యాక్షన్ తో విసుగు కూడా తెప్పిస్తారు. ఈ నేపథ్యంలోనే రవి తో శ్రీముఖి ప్రేమలో పడ్డదని అంటున్నారు సినీ జనాలు. ఇద్దరు స్క్రీన్ మీద కొట్టుకున్నట్టు కనిపించినా ఒకరినినొకరు ఇష్టపడుతున్నారని చెప్పుకుంటున్నారు.

అయితే ఈ వార్తలకు యాంకర్‌ రవి సోషల్‌ మీడియాలో స్పదించాడు. తన ఫేస్‌బుక్‌లో లైవ్‌లో స్పదింస్తూ... మ ఇద్దరి మద్య ప్రేమా లాంటిది ఏమి లేదు అని చెప్పాడు. ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ సోషల్ మీడియాలో యంకర్‌ రవి స్పదించాడు. ఫేస్ బుక్ లైవ్ వేదిక ద్వారా డైరెక్ట్‌గా అభిమానులతో మాట్లాడుతున్నారు, వారడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు.

 శ్రీముఖితో లవ్

శ్రీముఖితో లవ్

రీసెంట్ గా గా యాంకర్‌ రవి ఓ లైవ్‌ చాట్‌లో పాల్గొన్నాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు డైరెక్ట్‌గా సమాధానాలిచ్చేశి షాక్ ఇచ్చేసాడు. ఆ ప్రశ్నల్లో ...‘శ్రీముఖిని లవ్ చేస్తున్నారా?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా..‘బుద్ధున్నోడు ఎవడైనా చేస్తాడా?' అంటూ ఫక్కున నవ్వాడు.

 ఓవరాక్షన్ ..

ఓవరాక్షన్ ..

‘నీదీ, శ్రీముఖిదీ ఓవరాక్షన్‌ చూడలేకపోతున్నాంరా అయ్యా' అంటూ ఓ వ్యక్తి కామెంట్‌ పెట్టాడు. దానికి స్పందించిన రవి.. ‘నీ చేతిలో రిమోట్‌ ఉందిరా అయ్యా, దాన్ని ఛేంజ్ చెయ్‌రా అయ్యా' అంటూ అంతే ఘాటుగా జవాబిచ్చాడు.

 ఫన్ ఉండాలనే కాస్తంత

ఫన్ ఉండాలనే కాస్తంత

అలాగే ఓ ప్రొగ్రామ్‌లో బూతులు ఎక్కువైపోతున్నాయని ఓ నెటిజన్‌ ఫిర్యాదు చేశాడు. దానికి ‘అన్ని ప్రోగ్రామ్‌లు ఒకేలా ఉండవు. అన్ని ఎలిమెంట్‌లూ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు రూపకర్తలు. ఆ ప్రోగ్రామ్‌ అంతా ఫన్‌ ఉండాలన్నదే మా కాన్సెప్ట్‌. అందులో కొంచెం బూతులు కూడా ఉన్నాయనే విషయం నాకు తెలుసు' అని జవాబిచ్చాడు

 ఫేమ్ సంపాదించుకుంటాం

ఫేమ్ సంపాదించుకుంటాం


ఇక, ‘యాంకర్‌ శ్రీముఖితో నీకు అఫైర్‌ ఉందంటూ చాలామంది రాస్తున్నారని, అలాంటి వారందరినీ నరికేయమ'మని ఓ అభిమాని సలహా ఇచ్చాడు. దానికి స్పందిస్తూ.. ‘మా గురించి మంచో, చెడో ఏదోటి రాస్తున్నారంటే మేము వాళ్ల మెదళ్లలో ఉన్నట్టే కదా. మా ఎఫైర్‌ గురించి ఏమైనా రాసుకోండి. మేం అలాగే ఎక్కువ ఫేం సంపాదించుకుంటామ'అని రవి చెప్పాడు.

 ఐదు ఛానెళ్లలలో

ఐదు ఛానెళ్లలలో


రవి మొదట్లో పది వేల నుంచి సంపాదన ప్రారంభించాడు. ఆ తర్వాత సంధింగ్ స్పెషల్ పోగ్రామ్ కు యాభై వేల వరకూ తీసుకున్నాడు. ఒకప్పుడు కేవలం ఒకే ఛానెల్ లో పనిచేసే రవి...ఇప్పుడు ఐదు ఛానెళ్లలో చేస్తున్నాడు.

 మరికొంత వెనకేస్తున్నాడు

మరికొంత వెనకేస్తున్నాడు

బిజీ సమయంలో నెలకి నాలుగు లక్షలు సంపాదించే రవి..ప్రస్తుతం పటాస్, కిరాక్ వంటి కామెడీ పోగ్రామ్ లలో చేస్తూ మొత్తం నెలకు పది లక్షలు దాకా సంపాదిస్తున్నాడు. ఇవే కాకుండా మధ్య మధ్యలో స్టేజి షోలు, సినిమా పంక్షన్స్ వంటి వి చేస్తూ మరికొంత వెనకేస్తున్నాడు.

 తన షోలు ద్వారా

తన షోలు ద్వారా


యాంకర్స్ గా కెరీర్ మొదలుపెట్టి నటీనటులుగా మారి తమ సత్తాను చాటుతున్న వారు ఎందరో ఉన్నారు. ఇప్పడు యాంకర్ రవి కూడా అదే బాటలో నడుస్తున్నాడు. రవి చాలా మందికి తన షోల ద్వారా మంచి యాంకర్ అనే తెలుసు కానీ తనలో మంచి నటుడు కూడా ఉన్నాడని ఇటీవల నటించిన రెండు షార్ట్ ఫిల్మ్ ల ద్వారా నిరూపించుకున్నాడు.

 సత్తా చాటాడు

సత్తా చాటాడు


రాకేష్ డైరెక్ట్ చేసిన 'థాంక్యూ మిత్రమా', నంద కిషోర్ దర్శకత్వం వహించిన 'చిరంజీవి' అనే రెండు షార్ట్ ఫిలిమ్స్ లో రవి చక్కగా నటించాడనే చెప్పాలి. కథలు ఎంచుకునే తీరులో వైవిధ్యాన్ని చూపించడంతో పాటు నటనలో కూడా తన సత్తాను చాటుతున్నాడు. సినిమాల్లో కూడా నటించే అవకాశాలు రవిని వెతుక్కుంటూ వస్తున్నాయని టాక్.

 సంధింగ్ స్పెషల్ తో ..

సంధింగ్ స్పెషల్ తో ..

యాంకర్ రవి గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అక్కర్లేదు. మొదట ఆర్మీ అధికారిగా చేసి తర్వాత బుల్లి తెరపై ప్రవేశించి తన మాటలు, చేష్టలు ద్వారా దుమ్మురేపుతన్నారు. మొదట చిన్న కొరియోగ్రాఫర్ గా పనిచేసిన రవి ఆ తర్వాత మా మ్యూజిక్ లో సందింగ్ స్పెషల్ పోగ్రామ్ లో యాంకర్ గా ఎంటరై, మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

 స్టార్ డమ్ అలా..

స్టార్ డమ్ అలా..

ఈ కార్యక్రమంలో మరో యాంకర్ లాస్యతో కలిసి పనిచేసేసాడు. ఆ తర్వాత మెల్లిగా జీ తెలుగులో వచ్చే మొండి మొగుడు పెంకి పెళ్లాం అనే పోగ్రామ్ తో స్టార్ డమ్ పెంచుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత వచ్చే ఢీ జీనియర్స్, జీ తెలుగులో వచ్చే ఫ్యామిలీ సర్కస్ పోగ్రామ్ లతో తన కెరీర్ కు గట్టి పునాది వేసుకున్నారు. ఈ క్రమంలో తన క్రేజ్ పెంచుకునేందుకు, అభిమానులకు చేరువయ్యేందుకు సోషల్‌ మీడియా మంచి వేదికగా మార్చుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X