శ్రీముఖిపై యాంకర్ రవి కామెంట్స్.. బిగ్‌బాస్ కమిట్‌మెంట్ కోసమే! ఇదీ మ్యాటర్ అంటూ సెన్సేషన్
ఎప్పుడైతే శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3లో ఎంటరయిందో అప్పటినుంచి ఆమెకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ గెలుస్తుందన్న ఆమె చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే బిగ్ బాస్‌కి రాకముందు ఆమె పటాస్ షో ద్వారా బాగా ఫేం అయింది. ఈ షోలో శ్రీముఖి, యాంకర్ రవి అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే యాంకర్ రవి ఆమె గురించిన కొన్ని కామెంట్స్ చేశాడు. వివరాల్లోకి పోతే..

రవికి పర్ఫెక్ట్ జోడీ శ్రీముఖి
బుల్లితెరపై పటాస్ షో ద్వారా భారీ పాపులారిటీ సంపాదించిన శ్రీముఖి.. రవికి పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంది. ఈ ఇద్దరూ కలిసి పటాస్ స్టాండప్ కామెడీ షో ద్వారా బుల్లితెర హంగామా చేశారు. అయితే ఈ షో ఫుల్ పాపులర్ అయ్యాక.. శ్రీముఖి, రవి ఇద్దరూ తప్పుకున్నారు. కారణమేదైనా ఈ ఇద్దరూ తప్పుకోవడంపై రూమర్స్ గుప్పుమన్నాయి.

శ్రీముఖి గుడ్ బై.. యాంకర్ రవి క్లారిటీ
శ్రీముఖి కొన్ని ప్రత్యేకమైన కారణాల దృష్ట్యా పటాస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా వెళ్ళాలి కాబట్టి ఆమె పటాస్‌కి గుడ్ బై చెప్పింది. కానీ రవితో గొడవల కారణంతోనే శ్రీముఖి బయటికి వచ్చేసిందని ప్రచారం జరిగింది. దీంతో దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు యాంకర్ రవి.

శ్రీముఖి, యాంకర్ రవి.. అలా అనుకున్నారు కానీ
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి.. శ్రీముఖి గురించిన కొన్ని విషయాలు చెబుతూ తమపై వస్తున్న రూమర్స్ ఖండించాడు. శ్రీముఖి ఓ అద్భుతమైన కో యాంకర్ అని, అలాగే ఆమె మంచి అమ్మాయని తెగ పొగిడాడు రవి. తాను పటాస్ నుంచి బయటికి రాగానే.. శ్రీముఖి వెళ్ళింది కాబట్టి రవి వెళ్ళాడు అని అనుకున్నారు కానీ, నా వ్యక్తిగత కారణాల వల్లనే తాను బయటకొచ్చానని చెప్పాడు.

శ్రీముఖి చేసింది.. నేనూ చేశా
శ్రీముఖి బిగ్ బాస్ కమిట్‌మెంట్ కోసమే బయటికి వచ్చిందని అన్నాడు రవి. ''కెరీర్ ఎదగాలంటే పెద్ద ఆఫర్ వచ్చినపుడు మరోదాన్ని వదిలేసుకోవడంలో తప్పేముంది.. శ్రీముఖి అదే చేసింది. నేను కూడా అదే చేశాను'' అని ఓపెన్‌గా చెప్పేశాడు రవి.

అలాంటి వాళ్లకు క్లారిటీ ఇవ్వడం కూడా వృథా
ఇక శ్రీముఖితో తనకు గొడవలు అంటూ వస్తున్న వార్తలు రూమర్స్ అని తెలిపాడు రవి. ఆమెతో తనకెలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు. శ్రీముఖి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని అన్నాడు. శ్రీముఖితో తనకు గొడవలు అంటూ ప్రచారం చేస్తున్న వాళ్లకు ఏం చెప్పినా దండగే అని అన్నాడు రవి. అలాంటి వాళ్లకు క్లారిటీ ఇవ్వడం కూడా వృథా అని రవి పేర్కొన్నాడు.
Recommended Video

శ్రీముఖి చేసే హంగామా
యాంకరింగ్‌లో శ్రీముఖిది ఓ డిఫెరెంట్ స్టైల్ అని చెప్పాడు యాంకర్ రవి. తనపై పంచులేస్తూ శ్రీముఖి చేసే హంగామా సూపర్ అనిపిస్తుందని రవి స్వయంగా పేర్కొన్నాడు. మొత్తానికి శ్రీముఖి తన బెస్ట్ ఫ్రెండ్. ఇదీ మ్యాటర్.. అని క్లారిటీ ఇచ్చేశాడు యాంకర్ రవి.


Click it and Unblock the Notifications











