»   » ఇది మా ప్రేమ కథ... అంటూ యాంకర్ రవి సంచలనం!

ఇది మా ప్రేమ కథ... అంటూ యాంకర్ రవి సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు టీవీ యాంకర్ రవి... పటాస్ కార్యక్రమానికి సంబంధించిన వివాదాలతో ఈ మధ్య తరచూ వార్తల్లో ఉంటున్నాడు. దీంతో పాటు యాంకర్ లాస్య గురించి ఇష్యూలో ఇటీవల అతడి గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా రవి గురించి మరో న్యూస్ హాట్ టాపిక్ అయింది.

ఇప్పటి వరకు బుల్లితెరకే పరిమితం అయిన రవి త్వరలో వెండితెరపై అడుగు పెట్టబోతున్నాడు. యాంకర్ నుండి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చిలిపి యాంకర్ గా ఇప్పటి వరకు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రవి లవర్ బాయ్ గా వెండితెర ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్నాడు.

ఇది మా ప్రేమకథ

ఇది మా ప్రేమకథ

యాంకర్ రవి త్వరలో ‘ఇది మా ప్రేమ కథ' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 1>99 అనేది ట్యాగ్ లైన్. ఇందులో రవి ప్రేమికుడిగా కనిపించబోతున్నాడని, యూత్ మెచ్చే అంశాలతో ఈ లవ్ స్టోరీ ఉంటుందని టాక్.

గుట్టుచప్పుడు కాకుండా

గుట్టుచప్పుడు కాకుండా

యాంకర్ రవి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పెద్దగా పబ్లిసిటీ లేకుండా గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేసారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది.

దర్శకుడు ఎవరు?

దర్శకుడు ఎవరు?

ఈ సినిమాకు అయోధ్య కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ కొండకండ్ల సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.

ఎప్పుడు రిలీజ్ చేస్తారు?

ఎప్పుడు రిలీజ్ చేస్తారు?

సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని... ఏప్రిల్ నెలలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

English summary
Ace TV anchor Ravi who made a name for himself on the small screen is all set to hit the big screen soon. Yes, Ravi is soon going to turn as hero on the silver screen. He will be seen in a lover boy avatar in his next which is titled “Idi Maa Prema Kadha”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu