For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దారుణమైన కామెంట్స్: యాంకర్ రవిని వెంటాడుతున్న కోర్టు కేసు!

By Bojja Kumar
|
కోర్టుకు హాజరైన యాంకర్ రవి..!

రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో మహిళలను ఉద్దేశించి నటుడు చలపతిరావు అసభ్యమైన కామెంట్స్ చేయడం, దానికి యాంకర్ రవి సూపర్ అంటూ సమర్థించడం పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరిపై కేసు కూడా నమోదయింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం ఉదయం యాంకర్ రవి నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు.

 వెంటాడుతున్న కేసు

వెంటాడుతున్న కేసు

ఈ కేసు యాంకర్ రవిని ఇంకా వెంటాడుతూనే ఉంది. మహిళలను కించపరిచారన్న అభియోగాలతో రవిపై కేసు కోర్టులో ఇంకా కొనసాగుతోంది. కోర్టు వాయిదాకు హాజరైన రవి మాట్లాడుతూ తన మాటలను మీడియా వక్రీకరించిందని, కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం తానేమీ వ్యాఖ్యానించలేనని చెప్పాడు.

 ఫిబ్రవరి 7కు కేసే వాయిదా

ఫిబ్రవరి 7కు కేసే వాయిదా

ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. కేసు విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తానని తెలిపారు.

నా తప్పు లేదు

నా తప్పు లేదు

ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని, తనకు ఏ పాపం తెలియదని..... అపుడు చలపతిరావు ఏం మాట్లాడారో నాకు వినిపించలేదని, ఆయన అంత నీచమైన కామెంట్స్ చేసారని తర్వాత తెలిసిందని యాంకర్ రవి గతంలో ఓ ఇంటర్వ్యూలో వాపోయారు.

 మాకు ఎన్నో కష్టాలు ఉంటాయి

మాకు ఎన్నో కష్టాలు ఉంటాయి

ఆ రోజు అన్న పూర్ణ సెవెన్ ఏకర్స్‌లో ‘రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. నేను గీత యాంకరింగ్ చేస్తున్నాం. యాంకర్స్‌గా మేము స్టేజి మీద ఉన్నపుడు మాకు ఎన్నో కష్టాలు ఉంటాయి. డైరెక్టర్ మాకు ఇన్ ఇయర్ పీస్ ఇస్తాడు. తాను ఏమైనా ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటే దాని ద్వారా మాకు చెబుతాడు. అప్పుడప్పుడు ఎదురుగా ఉన్న మానిటర్స్ సరిగా పని చేయవు. జేఆర్సీ సెంటర్ లో, శిల్పకళా వేదికలో ఎప్పుడు చేసినా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ముందు నుండి ఆడియో ప్రాబ్లం ఉంది. ఈ విషయం టెక్నికల్ టీం వాళ్లకు తెలుసు, ఆర్గనైజర్లకు తెలుసు అని.... యాంకర్ రవి గతంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

 ఆడవాళ్లు మనశ్శాంతికి హానికరం.... వాడుకోవాలనుకున్నాం

ఆడవాళ్లు మనశ్శాంతికి హానికరం.... వాడుకోవాలనుకున్నాం

‘రారండయ్ వేడుక చూద్దాం' సినిమా స్టార్టింగ్ నుండి ట్రైలర్లో నాగ చైతన్య గారు ఓ మాట అన్నారు. ఆడవాళ్లు మనశ్శాంతికి హానికరం అని ఓ డైలాగ్ చెప్పడం జరిగింది. టీం మొత్తం ఆ వర్డ్ ను వాడుకోవాలని, అదే ఇంటరాక్టివ్ ఎంటర్టెనింగ్ గా ఫన్ గా సాగాలని చెప్పారు. అదే పాయింట్స్ అడగటం జరుగుతుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా చలపతి రావు ఆ కామెంట్స్ చేశారని యాంకర్ రవి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

 నాకు అమ్మ, చెల్లి అందరూ ఉన్నారు

నాకు అమ్మ, చెల్లి అందరూ ఉన్నారు

చలపతిరావుగారు అలాంటి మాట ఒకటి అంటారని ఊహించలేదు. అంత నీచంగా అంటాడని ఊహించలేదు. లేకుంటే నేను సూపర్ అని ఎందుకంటాను? నాకు ఇంట్లో ఫ్యామిలీ ఉంది...అమ్మ, చెల్లి అందరూ ఉన్నారు. ఆ మాట నాక వినపడలేదు కాబట్టి... సూపర్ నువ్వు వచ్చేయ్ అని అన్నాను. నిజంగా చలపతి రావు అన్న కామెంట్స్ నాకు వినిపించలేదు అని యాంకర్ రవి ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.

 నేను ఎన్ని చెప్పినా అర్థం చేసుకోరు

నేను ఎన్ని చెప్పినా అర్థం చేసుకోరు

రవిని ఇండస్ట్రీని నుండి బహిష్కరించాలనే మహిళా సంఘాల ఆ మద్య డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ ఇంటర్వ్యూలో యాంకర్ రవి స్పందిస్తూ... నేను ఆ మాట అనుంటే నేనే తలొంచుకుని సిగ్గుపడే వాడిని. చలపతి రావు అన్న మాట నాకు వినపడలేదని చెప్పినా... ఎవరూ విపించుకోరు, అర్ధం చేసుకోరు. కొన్ని విషయాల్లో మనం ఏమీ చేయలేమని యాంకర్ రవి తెలిపారు.

 మహిళా సంఘాలు అలా రియాక్ట్ అవ్వడంలో తప్పులేదు

మహిళా సంఘాలు అలా రియాక్ట్ అవ్వడంలో తప్పులేదు

చలపతిరావుగారు అన్న మాటకి మహిళా సంఘాలు హర్ట్ అయ్యారు. ఆ ప్లేసులో ఎవరున్నా హర్ట్ అవుతారు. మహిళలు అంటే మా అమ్మే గుర్తొస్తుంది. మహిళా సంఘాలు ఇలా రియాక్ట్ అవ్వడంలో తప్పులేదు. నిజం తెలుసుకుంటే...నేను చెప్పింది నమ్మితే మీకే అర్థమవుతుంది. ఇలాంటి చీప్ స్టేట్మెంట్లు నేనెప్పుడూ చేయలేదు, ఇలాంటివి ఎంకరేజ్ కూడా చేయను అని యాంకర రవి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

English summary
Anchor Ravi was present at the Nampally court. Anchor Ravi Clarifies on his Controversy over his saying 'super' after Actor Chalapathi Rao vulgar Comments on Women. He said he didn't mean it because he didn't hear properly what Chalapati Rao said.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more