బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రముఖ యాంకర్.. షాక్ అయ్యానన్న బిత్తిరి సత్తి

By Manoj Kumar

Recommended Video

Bigg Boss Telugu 3 : Teenmar Anchor Savithri Quits The Show, Bithiri Sathi Reacts On It || FIlmibeat

ప్రముఖ న్యూస్ చానెల్‌లో ప్రసారమయ్యే 'తీన్మార్' ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి ఆ ప్రోగ్రాం కోసం పని చేసే బిత్తిరి సత్తి ఒక కారణం అయితే, మరో కారణం సావిత్రి అలియాస్ శివజ్యోతి. తెలంగాణ యాసతో వార్తలు చెబుతూ ఎంతో మందిని తమ వైపునకు తిప్పుకున్న ఈ ఆన్‌స్క్రీన్ అక్కాతమ్ముడు తాజాగా విడిపోయారు.

సావిత్రి రాజీనామా

సావిత్రి రాజీనామా

అవును.. సావిత్రి బిగ్‌బాస్ సీజన్ -3లో పాల్గొనబోతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రస్తుతం పని చేస్తున్న న్యూస్ చానెల్‌కు గుడ్‌బై చెప్పేసింది. అందుకే రెండు రోజులుగా ఆమె తీన్మార్ ప్రోగ్రాంలో కనిపించడం లేదు. ఇప్పటికే స్టార్ మా‌తో ఒప్పందం చేసుకోవడంతో సావిత్రి ప్రస్తుతం పని చేస్తున్న చానెల్‌కు రాజీనామా చేసేసింది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు కూడా స్పష్టం చేస్తున్నారు.

బిత్తిరి సత్తి కామెంట్స్

బిత్తిరి సత్తి కామెంట్స్

సావిత్రితో పాటు తీన్మార్‌లో పని చేసే బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. సావిత్రి ప్రోగ్రాం నుంచి తప్పుకుందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ‘‘ఇది నాకు షాకింగ్ న్యూస్. కానీ, ఏదో ఒక రోజు జరిగేదే. ఆమె ఎక్కడ ఉన్నా.. ఏం చేసినా అంతా మంచే జరగాలని మేమంతా కోరుకుంటాం. ఆమె ప్రయత్నాలు ఫలించి భవిష్యత్ మంచిగా ఉండాలి'' అంటూ బిత్తిరి సత్తి ఓ న్యూస్ చానల్‌తో చెప్పుకొచ్చాడు.

చర్చనీయాంశంగా సత్తి కామెంట్స్

చర్చనీయాంశంగా సత్తి కామెంట్స్

బిత్తిరి సత్తి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. సావిత్రి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తుందని వార్తలు వస్తున్నా.. దానిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. అదే సమయంలో ఆమె తీన్మార్ నుంచి తప్పుకోవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే, తాజాగా సత్తి చేసిన వ్యాఖ్యలతో సావిత్రి బిగ్‌బాస్ ఎంట్రీపై వస్తున్న వార్తలకు క్లారిటీ వచ్చేసినట్లైంది. దీంతో ఆమె హౌస్‌లోకి వెళ్లడం పక్కా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

సావిత్రి గురించి..

సావిత్రి గురించి..

న్యూస్ చానెల్‌లో వచ్చే బులిటెన్ కోసం ప్రేక్షకులు ఎదురు చూసిన దాఖలాలు తక్కువే. కానీ, ‘తీన్మార్' వచ్చిన తర్వాత ఇది మారిపోయింది. ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ ప్రోగ్రాంతో సెలబ్రిటీగా మారిన సావిత్రి అసలు పేరు శివజ్యోతి. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఈమె తెలంగాణ యాసతో వార్తలు చదువుతూ ప్రజాదరణ పొందింది. బిత్తిరి సత్తితో పోటీ పడుతూ క్రేజ్ సంపాదించుకుంది. కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ సీజన్‌- 3లో అడుగుబెట్టబోతుంది.

బిగ్‌బాస్ షో డేట్ ఫిక్స్

బిగ్‌బాస్ షో డేట్ ఫిక్స్

తెలుగులో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న ‘బిగ్‌బాస్' సీజన్ 3 ఈ నెల 21 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లకు జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని హోస్టులుగా వ్యవహరించగా.. ఈ సీజన్‌కు మాత్రం అక్కినేని నాగార్జున రంగంలోకి దిగబోతున్నారు. ఈ మేరకు స్టార్ మా యాజమాన్యం ఇప్పటికే ఓ ప్రోమోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X