»   » యాంకర్ శ్యామల అందరినీ మోసం చేసింది? చివరకు ఒప్పుకుంది!

యాంకర్ శ్యామల అందరినీ మోసం చేసింది? చివరకు ఒప్పుకుంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో ఆడియో ఫంక్షన్లు, పలు టీవీ కార్యక్రమాల్లో యాంకర్ల ప్రాముఖ్యత పెరిగి పోయింది. తెలుగు తెరపై యాంకర్లుగా ఈ మధ్య బాగా ఫోకస్ అవుతున్న వారిలో అనసూయ, రష్మి, శ్రీముఖి, శ్యామలను ప్రముకంగా చెప్పుకోవచ్చు.

నిన్నటి తరం యాంకర్లు ఝాన్సీ, ఉదయభాను, సుమలతో పోలిస్తే..... ఈ తరం యాంకర్లు తమ మాటలతో పాటు అందం, యాటిట్యూడ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే అనసూయ, రష్మి, శ్రీముఖి లాంటితో పోలిస్తే శ్యామల కాస్త డిఫరెంట్ అని చెప్పక తప్పదు.

మోడ్రన్ డ్రెస్సుల జోలికి పోకుండా కాటన్‌ చీరలు, ట్రెడిషనల్‌ దుస్తులు ధరించి అచ్చతెలుగు యాంకర్ గా ఎంతో డీసెంట్ గా, అమాయకంగా కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి శ్యామల ఈ యాకంరింగ్ రంగంలోకి అనుకోకుండా వచ్చిందట.

ప్రేక్షకులను మోసం చేసిన విషయం

ప్రేక్షకులను మోసం చేసిన విషయం

మొదట్టలో టీవీల్లో వంటల ప్రోగ్రామ్‌తో బాగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే వంటల కార్యక్రమాలు చేసే సమయంలో ప్రేక్షకులను మోసం చేసిన విషయం శ్యామల ఇటీవల ఇంటర్వ్యూలో బయట పెట్టింది.

మోసం లాంటిదే

మోసం లాంటిదే

టీవీ కార్యక్రమాల్లో అందులో పాల్గొనే వారు వంటలు చేయడం, వాటిని యాంకర్లు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పడం లాంటివి చేస్తుంటారు. ఈ విషయం గురించి శ్యామల తెలుపుతూ టేస్ట్‌ చేసి చెప్పాల్సిన టైమ్‌లో నేనెప్పుడూ ఆ వంటకాన్ని తినేదాన్ని కాదు. నేను తెచ్చుకున్న చాక్లెట్‌ కానీ, పిప్పర్‌మెంట్‌ కానీ తినేసి అవసరమైన ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చేదాన్ని. పక్కవాళ్లు ఎవరో టేస్ట్‌ చేసి చెప్పేవారు. ఒకరకంగా ఇది మోసం లాంటిదే. కానీ, ఉద్యోగంలో ఇలాంటి తిప్పలు తప్పవుకదా' అని అసలు విషయం బయటపెట్టింది శ్యామల.

ఆనందహేల: యాంకర్ శ్యామల బర్త్ డే సెలబ్రేషన్స్

ఆనందహేల: యాంకర్ శ్యామల బర్త్ డే సెలబ్రేషన్స్

యాంకర్ శ్యామల బర్త్ డే మరో రెండు రోజుల్లో జరుగబోతోంది. ఇంతకు ముందు జరిగిన ఆమె బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోల కోసం క్లిక్ చేయండి.

English summary
Telugu Anchor Shyamala interview details. Tv Anchor Shyamala became popular in small screen as well as in big screen.Over the past five years Shyamala seen in Tv serials, tv shows.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu