2024 AP elections: పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓటమి ఖాయం.. తేల్చేసిన తెలుగు యాంకర్
కొద్ది రోజుల క్రితమే దేశం మొత్తం లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటిలో గెలిచిన వారు ఎవరు అని తేల్చే ఫలితాలు వెలువడే సమయం వచ్చేసింది. మరికొన్ని గంటల్లోనే విజేతలు ఎవరో తెలిపోనుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్‌పై అందరూ ఫోకస్ చేస్తున్నారు. అందులోనూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం ఫలితంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలను మీరే చూసేయండి!
ఎగ్జిట్ పోల్స్ వాళ్లకే మొగ్గు:ఆంధ్రప్రదేశ్‌లో మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లోనే రాబోతున్నాయి. దీంతో కొన్ని సర్వే సంస్థలు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సైతం వెల్లడించాయి. వీటిలో ఎక్కువ శాతం సంస్థలు ఈ సారి ఎన్నికల్లో కూటమి గెలిచే అవకాశం ఉందని తెలిపాయి. మరికొన్ని సంస్థలు మాత్రం వైసీపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి.

జనసేనాని గెలుపుపై ధీమా:అధికార వైసీపీని ఓడించాలన్న లక్ష్యంతో పవన్ కల్యాణ్.. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదే ఉత్సాహంతో ఎన్నికల్లో పాల్గొని ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలన్నీ జనసేనాని భారీ మెజారిటీతో గెలుస్తారని, జనసేనకు 15 సీట్లు తగ్గకుండా వస్తాయని ప్రకటించాయి.
పిఠాపురంపై దేశ వ్యాప్తంగా:ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లోనే వెలువడనున్న నేపథ్యంలో చాలా మంది జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంపై ఫోకస్ చేస్తున్నారు. అక్కడ ఆయన గెలవడం పక్కా అని.. అసలు ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారు అన్న దానిపై ఆసక్తిగా ఉన్నారు. దీంతో దేశంలోనే పిఠాపురం ఫలితం హట్ టాపిక్‌గా మారబోతుంది.

యాంకర్ శ్యామల కామెంట్:ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగిన తర్వాత నుంచే పిఠాపురంలో పవన్ కల్యాణ్ తప్పుకుండా విజయం సాధిస్తాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి ఎగ్జిట్ పోల్స్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ కాదని తెలుగు యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు.
వంగా గీతానే గెలుస్తారని:తాజాగా యాంకర్ శ్యామల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగానే ఆమె ఆంధ్రప్రదేశ్‌లో, పిఠాపురంలో ఎవరు గెలుస్తారన్న దానిపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 'ఈ సారి ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీనే గెలుస్తుంది. తద్వారా తిరిగి అధికారం చేపడుతుంది. ఇక, పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం వంగా గీతా గారే విజయం సాధించారు' అని చెప్పారు.

సాయపడడం చూడలేదు:యాంకర్ శ్యామల కంటిన్యూ చేస్తూ.. 'పవన్ కల్యాణ్ గారు ఎప్పుడూ అరవడం, ఆవేశ పడడం మాత్రమే చూశాను. ఆయన నలుగురికి సహాయపడడం, సేవ చేయడం మాత్రం చూడలేదు. అందుకే ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్నారు' అని వివరించారు. దీంతో ఇప్పుడు యాంకర్ శ్యామల చేసిన చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.


Click it and Unblock the Notifications











