Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శివాజీ రాజా విషయంలో యాంకర్ శ్యామల టంగ్ స్లిప్.. ఏం జరిగిందంటే!
మెగా డాటర్ నిహారిక తాజగా నటించిన చిత్రం సూర్యకాంతం. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా మారక నిహారికకు సరైన సక్సెస్ అందలేదు. దీనితో నిహారిక ఆచి తూచి అడుగులు వేస్తోంది. తనకు సరిపడే చిత్రాలని మాత్రమే ఎంచుకుంటోంది. సూర్యకాంతం చిత్రంలో నిహారిక కామెడీ ట్రై చేస్తోంది. ప్రణీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ విజయ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. నిహారిక ఎంచుకున్న ఈ కొత్త మార్గం ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఇటీవల జరిగిన ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
ప్రీరిలీజ్ ఈవెంట్
బిగ్ బాస్2 లో మెరిసిన యాంకర్ శ్యామల సూర్యకాంతం ప్రీరిలీజ్ ఈవెంట్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. బిగ్ బాస్ 2తో శ్యామల క్రేజ్ మరింత పెరిగిన సంగతి తెలిసిందే. సూర్యకాంతం ప్రీరిలీజ్ ఈవెంట్ లో శ్యామల, సీనియర్ నటుడు శివాజీ రాజా మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్యామల టంగ్ స్లిప్
శ్యామల శివాజీ రాజాతో మాట్లాడుతూ.. మా ఎన్నికలో విజయం సాధించిన తర్వాత తొలి ఈవెంట్ కు హాజరవుతున్నారు కదా అని ప్రశ్నించింది. వాస్తవానికి మా ఎన్నికల్లో నరేష్ విజయం సాధించారు. మా ఎన్నికని శ్యామల సరిగా ఫాలో కాలేదేమో.. అందుకే శివాజీ రాజా విజయం సాధించాడని పొరపాటు పడింది. శ్యామల పొరపాటుని శివాజీ రాజా కవర్ చేసే ప్రయత్నం చేశాడు. నేను గెలవలేదు.. నా టీమ్ సభ్యులు గెలిచారు అని శివాజీ రాజా తెలిపారు. మీ టీం గెలిస్తే మీరు గెలిపించినట్లే కదా అని శ్యామల తన పొరపాటుని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది.
నిహారిక గురించి
శివాజీ రాజా నిహారిక గురించి మాట్లాడుతూ.. తాను రియల్ సూర్యకాంతంతో కూడా నటించానని అన్నారు. లెజెండ్రీ నటి సూర్యకాంతం చాలా మంచివారని అన్నారు. కానీ నిహారిక మాత్రం మామూలు గయ్యాళి కాదు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దర్శకుడు ప్రణీత్ ని నిహారిక ఎన్ని ఇబ్బందులు పెట్టిందో.. అందుకే ఈ చిత్రానికి సూర్యకాంతం అని పేరు పెట్టారు అంటూ చమత్కరించారు.
చిన్నప్పటి నుంచి చూస్తున్నా
తాను వరుణ్ తేజ్, నిహారికని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వరుణ్ చాలా సైలెంట్ గా ఉంటాడు. కానీ నిహారిక తన ఫ్రెండ్స్ పెద్ద గ్యాంగ్ నే మైంటైన్ చేస్తోంది. అల్లరిపిల్ల. ఈ చిత్రానికి సూర్యకాంతం అనే టైటిల్ బాగా సూటవుతుందని మొదట చెప్పిన వ్యక్తిని తానే అని శివాజీ రాజా అన్నారు. మా ఎన్నిక ముగిసాక ఇటీవల మీడియా సమావేశంలో శివాజీ రాజా మాట్లాడుతూ.. నాగబాబుకు తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మా ఎలక్షన్స్ లో నాగబాబు నరేష్ కు మద్దతు తెలిపారు.