లైవ్ ఈవెంట్‌లో డైరెక్టర్‌ను ఇరికించిన శ్రీముఖి: అనుకోకుండా అంటూ తప్పించుకొన్న దర్శకుడు
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నారు. అందులో వెంకీ అట్లూరి ఒకడు. మొదటి సినిమాతోనే అదరగొట్టిన అతడు.. ఆ తర్వాతి సినిమాను మాత్రం సూపర్ హిట్‌గా మలచలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అదే 'రంగ్ దే'. యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం రాత్రి జరిగింది. దీనికి యాంకర్‌గా చేసిన శ్రీముఖి.. స్టేజ్ మీద నుంచి మూవీ డైరెక్టర్ వెంకీ అట్లూరిని విచిత్రమైన ప్రశ్నతో ఇరికించింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

అన్ని ఎమోషన్స్‌తో ‘రంగ్ దే’ అంటోన్న నితిన్
2021 ప్రారంభంలోనే భారీ ఫ్లాప్‌తో ఇబ్బంది పడ్డాడు యూత్ స్టార్ నితిన్. ఇలాంటి పరిస్థితుల్లో తన తదుపరి చిత్రాన్ని విడుదల చేసేందుకు అతడు రెడీ అవుతున్నాడు. ఆ సినిమానే 'రంగ్ దే'. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి 26న ఇది రిలీజ్ కానుంది.

ప్రమోషన్ మొదలు.. వినూత్న రీతిలో జనాల్లో
విడుదలకు సమయం దగ్గర పడడంతో 'రంగ్ దే' యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పాటలను విడుదల చేసిన మూవీ టీమ్.. ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసింది. అలాగే మూడు ప్రాంతాల్లో మూడు ఈవెంట్లను కూడా ప్లాన్ చేశారు. కర్నూలు, హైదరాబాద్‌లో ఇప్పటికే ఫంక్షన్లు పూర్తి చేశారు. ఈ రెండూ ఎంతో గ్రాండ్‌గా జరిగాయి.

రాజమండ్రిలో ఇంకోటి.. సందడి చేసిన తారలు
ముందుగా అనుకున్నట్లుగానే రాయలసీమలో ట్రైలర్ లాంచ్ నిర్వహించిన 'రంగ్ దే' యూనిట్.. ఆ తర్వాత హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసింది. ఇప్పుడు ఆంధ్రా ప్రాంతమైన రాజమండ్రిలో మరో ఫంక్షన్ చేసింది. బుధవారం రాత్రి మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్‌లో ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి నితిన్, కీర్తి సురేష్, వెంకీ అట్లూరి సహా యూనిట్ వచ్చింది.
అంటీల కనిపించిన జాన్వీ కపూర్.. బొద్దుగా ముద్దుగుమ్మలా

లైవ్ ఈవెంట్‌లో డైరెక్టర్‌ను ఇరికించిన శ్రీముఖి
ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన 'రంగ్ దే' గ్రాండ్ రిలీజ్ ఈవెంట్‌ను ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేసింది. ఎప్పటి లాగే తనదైన పంచులు, టైమింగ్‌తో ఆద్యంతం ఆకట్టుకుందామె. మరీ ముఖ్యంగా ఎవరి నుంచి ఎలాంటి ప్రశ్నలకు జావాబులు రావాలో.. అలాంటివే అడిగేసింది. ఈ క్రమంలోనే దర్శకుడు వెంకీ అట్లూరిని ఓ విచిత్రమైన ప్రశ్నతో ఇరికించేసిందీ బుల్లితెర రాములమ్మ.

మీరు మూడూ ఒకేలా ఎందుకు చేశారని అడిగి
ఈ ఈవెంట్‌లో దర్శకుడు వెంకీ అట్లూరిని మాట్లాడమని కోరిన శ్రీముఖి.. అతడు మైక్ అందుకుని సిద్ధం అయ్యాడు. సరిగ్గా అప్పుడే ఆమె.. 'మీరు డైరెక్టర్‌గా మూడు సినిమాలు చేశారు కదా.. ఆ మూడింటినీ లవ్ స్టోరీలతో ఎందుకు తీశారు? దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? మా ప్రేక్షకులంతా మీ సమాధానం కోసం చూస్తున్నారు' అంటూ అతడిని ఇరికించే ప్రశ్న అడిగింది.

అనుకోకుండా జరిగిందంటూ క్లారిటీ ఇచ్చేశాడు
శ్రీముఖి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. 'శ్రీముఖి నన్ను ఇరికించాలని చూస్తోంది. నేను కావాలని లవ్ స్టోరీలతోనే సినిమాలు చేయలేదండి. అనుకోకుండానే అలా జరిగింది. అయితే, రంగ్ దే కేవలం లవ్ గురించే కాదు.. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. వాటన్నింటినీ రంగులుగా చల్లబోతున్నాం. అందుకే ఈ టైటిల్ పెట్టాం. కచ్చితంగా ఈ మూవీ అలరిస్తుంది' అని చెప్పాడు వెంకీ.


Click it and Unblock the Notifications











