కుర్ర హీరోను లాగి చెంపదెబ్బ కొట్టిన యాంకర్ శ్రీముఖి!
తెలుగు వినోద పరిశ్రమలో శ్రీముఖి టాప్ యాంకర్. తనదైన శైలిలో మాటల చాతుర్యంతో ఇట్టే అందర్నీ ఆకట్టుకొంటుంది. గత కొన్నేళ్లుగా బుల్లితెరపైన, అలాగే వెంటితెరపైన బోల్డ్ లుక్‌తోను, బ్యూటీఫుల్‌గా, గ్లామరస్‌గా ఆకట్టుకొంటున్నది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లను, అలాగే రియాలిటీ షోలకు హోస్ట్‌గా టాప్ రేంజ్‌లో ఫెర్ఫార్మ్ చేస్తున్నారు. తాజాగా ఓ కుర్ర హీరోను చెంప దెబ్బ కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఆ హీరోను చెంపదెబ్బ కొట్టాడానికి కారణమేమిటంటే?
జబర్దస్త్ అవినాష్ స్పెషల్ రోల్‌లో:వినూత్నమైన కథతో, కంటెంట్‌ను నమ్ముకొని బీ2పీ స్టూడియోస్ బ్యానర్‌పై అఖిలేష్ కలారు నిర్మాతగా వీఎస్ ముఖేష్ దర్శకత్వం వహించిన చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. ఈ చిత్రంలో నూతన నటీనటులు పార్వతీశం హీరోగా, ప్రణీకాన్వికా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రం జబర్ధస్త్ అవినాష్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

కూరగాయలు అమ్ముకొనే యువతితో.. :ఇక చిన్న చిత్రమైనా నిర్మాత, దర్శకులు తమ కంటెంట్‌ను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లేందుకు రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మాత్రమే కాకుండా టైటిల్‌కు కూడా ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చేస్తున్నది. కూరగాయలు అమ్ముకొనే యువతికి, సాఫ్ట్ వేర్ అబ్బాయికి మధ్య జరిగే ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కింది.

రంగంలోకి దిగిన శ్రీముఖి:ఈ సినిమా ప్రమోషన్స్ కోసం టాప్ యాంకర్ శ్రీముఖి తనవంతు సహకారం అందించారు. స్పెషల్ ఇంటర్వ్యూ కోసం చిత్ర యూనిట్ ఆమెను రంగంలోకి దించారు. నటీనటులు, నిర్మాత, దర్శకులతో యాంకర్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రమోషనల్ వీడియోలను చిత్రీకరించారు. ఈ క్రమంలోనే హీరోతో కలిసి శ్రీముఖి ప్రమోషనల్ షూట్‌లో పాల్గొన్నారు.
శ్రీముఖికి హీరో లవ్ ప్రపోజల్:మార్కెట్ మహాలక్ష్మి ప్రమోషనల్ షూట్ సందర్భంగా బిజీగా ఉన్న శ్రీముఖి వద్దకు వచ్చి ఆ మూవీ హీరో పార్వతీశం వచ్చి లవ్ ప్రపోజల్ చేసే ప్రయత్నం చేశారు. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అని హీరో పార్వతీశం అంటే.. వెంటనే అతడి చెంపపై లాగి పెట్టి కొట్టింది. దాంతో షాక్ తిని తిరిగి వెళ్తుండగా.. మార్కెట్ మహాలక్ష్మి.. మజాక్ లాడితే మంచిగుండదు అని వార్నింగ్ ఇచ్చింది.
మూవీ రిలీజ్ ఎప్పుడంటే? :ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకొంటున్నాయి. ఈ సినిమాను మార్చి 29వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా కోసం శ్రీముఖితో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా చిన్న టీజర్‌ను మీడియాకు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











