Varun Tej Lavanya Tripathi: వరుణ్ తేజ్, లావణ్యల మధ్య చిచ్చు పెట్టిన యాంకర్ సుమ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్యల మధ్య యాంకర్ సుమ చిచ్చు పెట్టింది. అవునండి నిజమే... వారు ఏదో ప్రేమించుకుని.. పెళ్లి చేసుకునే పనిలో ఉంటే.. సుమ ఎంటర్ అయి వారి మధ్య మంట పుట్టించింది. వరుణ్ నటిస్తున్న తాజా చిత్రం గాండీవధారి అర్జున. ఆగస్టు 21న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంటు ఘనంగా జరిగింది. అయితే ఇందులో వరుణ్ తేజ్ ను ఇరకాటంలో పడేసే క్వశ్చన్ అడిగింది సుమ. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వరుణ్ తేజ్, లావణ్యలు పెళ్లి చేసుకోబుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరి నిశ్చితార్ధం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. వీరి ఎంగైజ్మెంట్ వేడుకకు ఇరు కుటుంబాలతో సహా ప్రముఖులు హాజరయ్యారు. ఇక వీరి పెళ్లి ఇప్పటికే కావాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఇటలీలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇక వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఈ నవంబరు 1వ తేదీ అంటూ కూడా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే వీరి పెళ్లికి ముహుర్తం కూడా ఫిక్స్ అయిందట. ఇక ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే వరుణ్ తేజ్, లావణ్యల మధ్య యాంకర్ సుమ చిచ్చు పెట్టిందా అంటే నిజమేనని తెలుస్తోంది.
అసలు ఏం జరిగిందంటే... వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం గాండీవధారి అర్జున. ఇక ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇక నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకుంది ఈ మూవీ.

అయితే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంటులో సుమ.. వరుణ్ తేజ్ ను ఇరకాటంలో పెట్టే ప్రశ్నను వేసింది. మీకు కాల్ మి అర్జెంట్ అనే మెసేజ్ ఇద్దరి నంబర్లతో ఓకేసారి వస్తే దేనికి కాల్ చేస్తారు అని అడిగింది. అయితే ఆ నంబర్లు ఒకటి నిహారిక, రెండు లావణ్య అంటూ చెప్పుకొచ్చింది. దీనికి బాగా ఆలోచించిన వరుణ్... ముందు నా చెల్లికి కాల్ చేస్తాను అని చెప్పాడు. ఎందుకంటే.. మా చెల్లి చిన్నది కాబట్టి అని కవర్ చేశాడు.
అయితే ఈ ప్రశ్నకు వరుణ్ సమాధానికి మంచి మార్కులు అని చెప్పిన సుమ... ఇక మిగలింది మీరు లావణ్య ఇంటికి వెళ్ళాక చూసుకోండి.. అంటూ సుమ నవ్వులు పూయించింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ వారి మధ్య సుమ చిచ్చు పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. చెల్లెలికి ప్రయారిటీ ఇస్తే.. లావణ్య చేతిలో వరుణ్ కు ఉంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











