పొగలు కక్కుతున్న యాంకర్ సుమ... ఎందుకంటే ??
Recommended Video

యాంకర్ సుమ స్టేజీ ఎక్కిందంటే మాటలు వరదలా పారాల్సిందే. అందరినీ ఆకట్టుకునేలా టైమింగుతో ఆమె వేసే పంచ్‌లతో యాంకరింగ్‌లో తనకి తానే సాటి అని నిరూపించుకుంది. కేరళలో పుట్టి పెరిగినా... అచ్చం తెలుగమ్మాయిగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుమ సందర్భాన్ని బట్టి కొన్ని పోస్ట్‌లు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను ఎంటర్టెన్ చేస్తూ ఉంటారు.
తాజాగా సుమ పోస్టు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐస్ క్రీమ్ లాంటి పదార్థం ఏదో తింటూ నోట్లో నుండి, ముక్కులో నుండి పొగలు కక్కూతున్న ఈ వీడియో గురించి అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అసలు సుమ తింటున్న ఆ పదార్థం ఏమిటని ఆరా తీస్తూ తాము కూడా దాన్ని ట్రై చేయాలని ఉవ్విల్లూరుతున్నారు.

ఫేస్‌బుక్‌లో సుమకు దాదాపు మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియో పోస్టు చేసినప్పటి నుండి చాలా మంది సుమ ఆమె తింటున్న పదార్థం ఏమిటి? ఎక్కడ దొరుకుతుంది? అనే ప్రశ్నలతో ముంచెత్తుతున్నారట.


Click it and Unblock the Notifications











