రష్మిక మందన్నతో సుమ ఇలా అనేసిందేంటి? సినీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ..

Recommended Video

Anchor Suma Tounge Slip At Sarileru Neekevvaru Pre Release Event

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న, తెలుగు పాపులర్ యాంకర్ సుమ మధ్య జరిగిన ఓ సన్నివేశం.. ఆ సమయంలో సుమ మాట్లాడిన తీరు సినీ వర్గాల్లో హాట్ హాట్ చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో రష్మిక మందన్నతో సుమ ఇలా అనేసిందేంటి? కావాలనే అందా లేక ఫ్లోలో అనేసిందా? అనే టాక్ ముదిరింది. ఇంతకీ రష్మిక మందన్న- సుమ మధ్య ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..

గ్రాండ్ ఈవెంట్.. సరిలేరు నీకెవ్వరు

గ్రాండ్ ఈవెంట్.. సరిలేరు నీకెవ్వరు


మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతికి సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న (జనవరి 5) హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అత్యంత ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు యూనిట్ సభ్యులు.

మెగాస్టార్ చీఫ్ గెస్ట్.. దద్దరిల్లిన స్టేడియం

మెగాస్టార్ చీఫ్ గెస్ట్.. దద్దరిల్లిన స్టేడియం


'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరై సందడి చేశారు. ఆయన చీఫ్ గెస్ట్ కావడంతో వేదికపై చిరంజీవి మధురమైన, మైమరిపించే పాటలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఇక మెగా అభిమానులతో పాటు సూపర్ స్టార్ అభిమానులు లక్షల్లో హాజరు కావడంతో స్టేడియం కిక్కిరిసిపోయింది.

యాంకర్ సుమ హంగామా.. అనుకోకుండా వేదికపై

యాంకర్ సుమ హంగామా.. అనుకోకుండా వేదికపై

ఇక పెద్ద ఈవెంట్ అనగానే ముందుగా గుర్తొచ్చే యాంకర్ ఎవరయ్యా అంటే.. అది ఖచ్చితంగా సుమనే. ఈ వేడుకకు కూడా ఆమెనే యాంకరింగ్ చేసి వేడుకకు హాజరైన అందరినీ ఆనందపరిచే పర్‌ఫార్‌మెన్స్ కనబర్చింది. యాంకరింగ్ అన్నాక మాట్లా గారడి చేస్తేనే‌గా కిక్కు. ఎప్పటిలాగే అదే చేసిన సుమ అనుకోకుండా వేదికపై ఓ మాట చెప్పడంతో అది కాస్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వేదికపైకి వచ్చిన రష్మిక ఓ నాలుగు ముక్కలు మాట్లాడాక..

వేదికపైకి వచ్చిన రష్మిక ఓ నాలుగు ముక్కలు మాట్లాడాక..

ఈవెంట్ జరుగుతుండగా వేదికపై మాట్లాడటానికి వచ్చిన హీరోయిన్ రష్మిక మందన్న.. అక్కడున్న అశేష అభిమాన వర్గాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బయింది. నవ్వుతూ ఎంతో ఉత్సాహంతో వేదికపైకి వచ్చిన రష్మిక ఓ నాలుగు ముక్కలు మాట్లాడాక.. ఇంత మంది మహేష్ అభిమానులను చూస్తుంటే తనకు ఏం మాట్లాడాలో తెలియట్లేదని ఎక్సైట్‌మెంట్‌‌గా అనేసింది.

రష్మికతో సుమ డైలాగ్.. ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ ఇష్యూ

రష్మికతో సుమ డైలాగ్.. ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ ఇష్యూ


రష్మిక ఆ మాట అనగానే వెంటనే అందుకున్న సుమ.. ''పర్వాలేదు మాట్లాడు..ఎవరి డబ్బా వాళ్లు కొట్టుకోవాలి కదా.. మీరు మాట్లాడండి" అనేసింది. ఆ తర్వాత రష్మిక కొద్దిసేపు మాట్లాడి వేదిక దిగింది. దీంతో రష్మికతో సుమ అన్న ఈ మాటనే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారింది. సుమ ఏదో ఫ్లోలో అన్నప్పటికీ దానిని బూతద్దంలో పెట్టి చూస్తున్నారు కొందరు.

క్లీన్ అండ్ నీట్ యాంకర్‌ సుమ.. అలా ఎలా అంటుంది?

క్లీన్ అండ్ నీట్ యాంకర్‌ సుమ.. అలా ఎలా అంటుంది?


సుమ వేసిన 'ఎవరి డబ్బా వాళ్లు కొట్టుకోవాలి' అనే పంచ్ డైలాగ్‌పై ఎవ్వరి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు. ఈ డైలాగ్ ద్వారా 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర యూనిట్ అందరినీ సుమ అవమానించారని చెప్పుకుంటున్నారు. స్టేజ్ పైకి వచ్చేవాళ్లు డబ్బా కొట్టుకుంటున్నారని ఆమె ఇలా ఎలా అంటుందని చర్చించుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా క్లీన్ అండ్ నీట్ యాంకర్‌గా వెలుగొందుతున్న సుమపై ఇలా మాట్లాడుకోవడం ఎంతవరకు సబబో చెప్పడం కష్టమే!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X