ఏయ్ ముందు వరుసలు మార్చు... ఆయన్ను బావ అని పిలువు: యాంకర్ సుమ ఫైర్
ఇప్పుడంతా 'ఇన్‌స్టాగ్రామ్' హవా నడుస్తోంది. దీంతో సినీ సెలబ్రిటీలు సైతం ఇందులో ఖాతా ఓపెన్ చేసి అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఇటీవలే ఇందులో చేరిన యాంకర్ సుమ తొలిసారి అభిమానులతో లైవ్ చాట్ చేశారు.
నేను అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్లో టచ్ లో ఉంటాను. వేరిఫైడ్ టిక్ ఉన్న అకౌంటుకు మాత్రమే కనెక్ట్ అవ్వడం, పర్సనల్ గా ఏదైనా వీడియో పెడితేనే దాన్ని నమ్మండి. వేరేవాళ్లు నా గురించి పెట్టే వీడియోలను పట్టించుకోవద్దు అని సుమ సూచించారు.

దానికి అర్థం తెలియకుండానే ఇటు వైపు వచ్చా?
నువ్వు నా ఫేవరెట్ యాంకర్ అక్క అనే ఓ అభిమాని కామెంటుపై సుమ స్పందిస్తూ థాంక్స్ చెప్పారు. యాంకర్ అనే పదానికి అర్థం తెలియకుండానే ఈ వృత్తిలోకి వచ్చాను. దూరదర్శన్ నుండి నా జర్నీ మొదలైంది. అపుడు యాంకరింగ్ అనే ప్రొఫెషన్ లేదు. తర్వాత చాలా ఛానల్స్ లో ప్రొగ్రామ్స్ చేశాను. ఇన్నేళ్ల ఈ జర్నీ గురించి తలుచుకుంటే ఎంతో అందంగా ఉంటుందని సుమ అన్నారు.

త్వరలో సర్ ప్రైజ్, సినిమాల్లోకి?
త్వరలో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అదేంటో ఇప్పుడే చెప్పను. ఈ సంవత్సరం చివరకల్లా చెబుతాను అని సుమ తెలిపారు. సుమ వ్యాఖ్యలు బట్టి ఆమె సినిమాల్లోకి వస్తుందనే ప్రచారం జోరందుకుంది.

కన్నతల్లి, అన్నంపెట్టిన తల్లి
తెలుగు, మలయాళంలో ఏది ఇష్టం అంటే ఒకటి కన్నతల్లి, ఇంకొకటి అన్నం పెట్టిన తల్లి అని సుమ తెలిపారు. అయితే తాను మలయాళం కంటే తెలుగులోనే ఎక్కువ ప్లూయెంటుగా మాట్లాడతాను, నేను చదువుకునే రోజుల నుండే హైదరాబాద్‌లో ఉండటం వల్ల ఇంతబాగా తెలుగు మాట్లాడగలుగుతున్నాను అని తెలిపారు.

ఏమిటా వరసలు
అక్క మీరు రాజీవ్ అన్నయ్యతో ఓ సినిమా చేస్తే బావుంటుంది... అని ఓ అభిమాని ప్రశ్న వేయగా దీనిపై సుమ ఆసక్తికరంగా స్పందించారు. ఏమిటా వరసలు? ముందు వరసలు మార్చు... పిలిస్తే నన్ను వదినా అని పిలవండి, ఆయన్ను అన్నయ్య అనండి. లేదంటే నన్ను అక్క అనండి, ఆయన్ను బావా అనండి అని సూచించారు. ఆయనతో మూవీ చేస్తే చూడాలని ఉందా? ఈ విషయం రాజీవ్‌ను అడిగి చెబుతాను అని సుమ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











