కేటీఆర్‌ను కూడా వదల్లేదు.. యాంకర్ సుమ ప్లానింగ్స్ వేరే లెవెల్!
యాంకర్ సుమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ సుమ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ.. కరోనాపై అవగాహన కల్పిస్తూ.. తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తోంది. అంతేకాకుండా అందర్నీ ఎంటర్టైన్ చేసేలా ఫన్నీ వీడియోలను షేర్ చేస్తోంది. అయితే ప్రస్తుతం సుమ ఓ కొత్త పనిని చేయబోతోన్నట్టు తెలుస్తోంది. మొదటి సారిగా ఓ రాజకీయ నాయకుడిని సుమ ఇంటర్వ్యూ చేయనుంది.

సినిమా వాళ్లతో ఫటాఫట్..
సుమకు సినిమా వాళ్లతో ఉండే ర్యాపో గురించి అందరికీ తెలిసిందే. ఎంతటి వారితోనైనా సరే.. ఎలాంటి వారినైనా సరే తన చాకచక్యం, సమయస్ఫూర్తితో ఇట్టే కట్టి పడేస్తుంది. ఎవరికి ఎలా కౌంటర్లు ఇవ్వాలో అలా ఇస్తుంది. సుమ ఇంటర్వ్యూలు చేసినా స్టేజ్ ఎక్కి గడగడలాడించిని అది వేరే లెవెల్‌లో ఉంటుంది.

లాక్డౌన్‌లో అలా..
లాక్డౌన్ వల్ల సుమ గురించి ఎన్నో విషయాలు అందరికీ తెలిశాయి. బుల్లితెరపై, సినిమా ఫంక్షన్లలో సందడి చేసే సుమ ఇంట్లో ఎలా ఉంటుందనే అనుమానం అందరికీ వచ్చేది. కానీ ఎవ్వరికీ అంతగా తెలియదు. కానీ లాక్డౌన్ వల్ల సుమలోని ఇంకో కోణం అందరికీ తెలిసిందే. ఇంట్లో సాధారణ గృహిణిలా ఉంటూ తన పెట్‌తో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటుంది.

సోషల్ మీడియాలో రచ్చ..
ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ తమ కంటూ ప్రత్యేకంగా యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించారు. సుమ కూడా సుమక్క అనే పేరుతో చానెల్ ప్రారంభించింది. అతి తక్కువ కాలంలోనే అది బాగా ఫేమస్ అయింది. అందులో ఈట్ టాక్ అనే ఓ ప్రోగ్రాం బాగానే క్లిక్ అయింది.

గెస్ట్‌లతో ఆడుకుంటుంది..
సుమ నడిపించే ఈ ఈట్ టాక్ షోలో సుధీర్, ప్రదీప్ చేసిన రచ్చ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. సుధీర్‌తో పులిహోర చేయించిన సుమ.. ప్రదీప్‌తో మ్యాగీ వరకే సరిపెట్టుకుంది. తాజాగా రేణూ దేశాయ్‌ను కూడా ఈ షోకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే ఇంత వరకు సినీ తారలతోనే ముచ్చటించిన సుమ మొదటిసారి పొలిటికల్ లీడర్‌తో ముచ్చట్లు పెట్టింది.

కేటీఆర్‌తో సుమ..
ప్రస్తుతం సుమ కేటీఆర్‌ను స్పెషల్ ఇంటర్వ్యూ చేసినట్టు కనిపిస్తోంది. తాజాగా కేటీఆర్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న ఫోటోను సుమ షేర్ చేస్తూ.. కేటీఆర్‌తో ఈ ఇంటర్వ్యూ ఎంతో సంతోషంగా ఉంది.. ఓ హైద్రాబాదీగా మన సిటీ గురించి తెలుసుకోవాల్సి ఎంతో ఉంది.. ఎల్లప్పుడూ అభివృద్ది చెందుతూ ఉండే ఈ సిటీలో అమలు పరిచే తదుపరి ప్రణాళికలు ఇలా ఎన్నెన్నో పంచుకున్నారు. మీ టీంకు మీకు కుదోస్ సర్ అంటూ సుమ కేటీఆర్‌ను పొగిడేసింది.


Click it and Unblock the Notifications











