twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ సుమ అమ్మమ్మ "100ఏళ్ల దోశ"కి పిచ్చిడిమాండ్.... ఈ వీడియో ఇప్పటికే ఆరులక్షలమంది చూసేసారు

    |

    సుమ అదే చలాకీ తనం తో, అంతే అందం తో దాదాపు ఇరవయ్యేళ్ళుగా తెలుగు బుల్లి తెర మహా రాణి గా నిలంబడింది యాంకర్ సుమఆమెకు చిన్నా పెద్దా, ఆడ మగా అందరూ అభిమానులే. 'సుమ'ధురంగా మాటల సెలయేరులో ప్రేక్షకుల్ని పయనింపచేయడం ఆమె ప్రత్యేకత. అదే స్టేజిషోలయితే సమయస్ఫూర్తితో... కొన్ని సెటైర్లు, మరికొన్ని పంచ్‌లు వేస్తూ, చమక్కులు విసురుతూ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తారామె. ఔత్సాహిక యాంకర్స్ అందరికీ సుమ ఇన్ స్పిరేషన్ అనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇంతగా తాను ఉత్సాహంగా ఉండడానికి కారణం.. తన అమ్మమ్మే అంటోంది సుమ.

    Anchor Suma Kanakala 100 years Grand Mother preparing Dosa

    బుల్లితెర యాంకర్ రాజీవ్ కనకాల సతీమణి సుమ కనకాల గురించి తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కేరళ అమ్మాయి అయినా అచ్చ తెలుగు వారికంటే స్పష్టంగా తెలుగు మాట్లాడగలరు. ఒకరకంగా తెలుగింటి ఆడపడుచు అయ్యింది సుమ. కాగా, సుమ అమ్మమ్మ 'పల్లసన పచ్చువిట్టిల్ సావిత్రమ్మ' మంగళవారం తన వందవ పుట్టినరోజు వేడుకలను కేరళలో జరుపుకున్నారు.

    Anchor Suma Kanakala 100 years Grand Mother preparing Dosa

    ఈ వేడుకల కోసం సుమ, భర్త రాజీవ్ కనకాల కేరళ వెళ్లారు. అమ్మమ్మ వందేళ్ల పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం తన జీవితంలో మర్చిపోలేని రోజని, అరుదైన ఈ రోజును ఆనందంగా గడుపుతున్నానని చెప్పారు. నిర్మలమైన మనసు, అందరూ బాగుండాలనే తపన, ఎప్పుడూ పెదవులపై చిరునవ్వు ఇవే తన అమ్మమ్మ వందేళ్ల జీవితానికి నిదర్శనాలని ఈ సందర్భంగా సుమ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు అమ్మమ్మతో దోశ వేయిస్తూ తీసిన ఒక వీడియో కూడా ఆమె తన పేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

    అమ్మమ్మతో గడిపిన కొన్ని క్షణాలను అభిమానులతో కూడా సుమ పంచుకుంది. ఆ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఆమె దోశ వేస్తుంటే.. పక్క నుంచి చూసి ఎంజాయ్ చేయడమే కాదు..'అమ్మమ్మ హండ్రెడ్ ఇయర్స్.. దోశ వేస్తోంది' అంటూ చెప్పేస్తోంది. అక్కడకెళ్లి కూడా అమ్మమ్మకి యాంకరింగ్ చేసేసింది సుమ.అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే ఆరు లక్షల మందికి పైగా ఈ వీడియోని చూసారు. 3087 మంది షేర్ చేసారు కూడా...

    English summary
    Popular anchor Suma visited Kerala to celebrate the 100th birthday of her maternal grand mother Pallasana Pacchuvittil Savitramma. posted the dosa making video of her grand mother on social networking site that has gone viral. Suma is seen helping her in the preparation of Dosa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X